మరో కామారెడ్డి కాకుండా కలెక్టర్ చర్యలు చేపట్టాలి!

1000 ఎకరాల్లో రైతుల వినియోగ హక్కులపై ఆంక్షలు!

రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వ కుట్ర !

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

J. Surender Kumar

దాదాపు1000 ఎకరాల్లో రైతుల వినియోగ భూముల హక్కులపై ఆంక్షలు విధించే యత్నంలో
రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వ కుట్ర చేస్తున్నదని.మరో కామారెడ్డి సంఘటన పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలి ఉంటూ పొట్ట బదులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన జగిత్యాల లోనీ ఇందిరాభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాటలలో..

జగిత్యాల మున్సిపల్ పరిధిలో లేని గ్రామాల్లో రిక్రియేషన్, ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండి పడ్డారు. గ్రామ సభల తీర్మానాలకు అనుగుణంగా చర్యలు చేపడుతామని కలెక్టర్ స్పష్టత ఇవ్వాలి. గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు
నర్సింగాపుర్, తిప్పాన్న పేట, కండ్లపల్లి, తిమ్మాపూర్, హస్నాబాద్, లింగంపెట్ గ్రామాల్లో రిక్రియేషన్, ఇండస్ట్రియల్ జోన్ల పేరిట 1000 ఎకరాలు రిజర్వ్ చేయడం తో రైతులు భుములపై వినియోగించుకునే హక్కు కోల్పోవడమే గాకుండా, భూముల విలువలు తగ్గే ప్రమాదం ఉందన్నారు.
ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోని యావర్ రోడ్డును విస్తరిస్తామని ఎన్నికల్లో లబ్ది కోసం హామీ ఇచ్చి, న్యాయస్థానంలో ఉందంటూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.
యవర్ రోడ్డు అంశం కోర్టులో ఉందని ఎన్నికలప్పుడు తెలియదా ? అని ప్రశ్నించారు.
సమస్య పరిష్కారం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగిత్యాలలోని యావర్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి మున్సిపల్ సభ్యులు 2017జూన్ 17 న అధికారులకు నివేదించారు అని పేర్కొన్నారు.
నాలుగేళ్లుగా యావర్ విస్తరణ చేపట్టకుండా మంత్రి కెటీఆర్ నిర్లక్యం వహించారన్నారు.
యావర్ రోడ్డు అంశం పక్కదారి పట్టించేందుకు జోన్ల ఏర్పాటు అంశం తెర పైకి తీసుకు వచ్చారని దుయ్యబట్టారు.
ప్రతిపాదించేటప్పుడు గ్రామాల తీర్మానం తీసుకోవాలని అవసరం లేదా అని ప్రశ్నించారు.
ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిదర్శనమని విమర్శించారు.
విలువైన భూములపై హక్కులు కోల్పోయే రైతుల ఆగ్రహం ప్రభుత్వం ఎదుర్కొనక తప్పదు అని హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో

రైతుల భూముల వినియోగం పై ఆంక్షలు విధిస్తే మరో రైతాంగ ఉద్యమానికి దారి తీస్తుంది.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
జోన్ల ఏర్పాటు కు సంబంధించి గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి..
గ్రామ సభలు నిర్వహించి, తదనుగుణంగా కలెక్టర్ చర్యలు చేపట్టాలి.
మరో కామరెడ్డి కాకుండా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సమావేశం లో పిసిసి సభ్యులు గిరి నాగ భూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపళ్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, వర్తక సంఘం అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, బండ శంకర్, రాధా కిషన్, పుప్పాల అశోక్,, ఎన్ ఆర్ఐ సెల్ చాంద్ పాష, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, రఘు వీర్ గౌడ్, మహిపాల్, విజయ్, ముద్దం రాజిరెడ్డి, నక్క మధు, తిరుపతి మహిపాల్ , లక్ష్మణ్ తదితరు పాల్గొన్నారు
.