మాస్టర్ ప్లాన్ లోసెంటు భూమి రైతులది పోనివ్వ !
మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయిస్తా…

ఎమ్మెల్యేగా నేనే బాధ్యత వహిస్తా…
ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరాటం_

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్_

J.Surender Kumar

జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ తో ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా చూస్తానని, ముసాయిదా రద్దు చేయిస్తానని, రైతుల సెంటు భూమి పోనివ్వనని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
20 ఏండ్లకోసారి మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అదేశాలిస్తుందని అ దిశలోనే ఓసంస్థ సర్వే చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కొందరు అధికారుల పొరపాటు జరిగిందన్నారు. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని ఇందులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు.

అభ్యంతరాలకు 60 రోజుల టైం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయ అవకాశవాదులు తమ పబ్బం గడుకోవడానికి రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. రైతులది సెంటు భూమి పోనివ్వనని హామీ ఇస్తున్నామని ఎమ్మెల్యే న్నారు. అవసరమైతే ముసాయిదాను రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నట్లుగా నేనే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా మార్చారని దీనితో ఎందరికో ఇంటి అనుమతులు రాక ఇబ్బందులు పడ్డారన్నారు. కొందరు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయాలంటూ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై మేము మీలాగా ప్రజలను రెచ్చ గొట్ట లేదని ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు. మాస్టర్ ప్లాన్ జాబితాలో ప్రజల అబ్యఅంతరాలను 60 రోజుల వరకు సేకరించి జాభితాగా తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ను మరిచిపోయారని రాజకీయ నిరుద్యోగులగా మారారని నిత్యం పేపర్లో, టీవీల్లో కనిపించేందుకు తహతహలాడుతారని విళ్ళతో ప్రజలకు మేలు ఏమిజరగదని అందులో జీవన్ రెడ్డి ఒకరని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. జగిత్యాల శివారు గ్రామాలను మునిసిపల్లో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయని కానీ నేను ఒప్పుకోలేదన్నారు. కోరుట్ల, మెట్ పెల్లి, వేములవాడ, సిరిసిల్ల మునిసిపల్ చుట్టుపక్కల గ్రామాలు చేర్చారన్నారు. పంచాయతీ లు ఉంటేనే స్వయం పరిపాలన ఉంటుందన్న అభిప్రాయం తనదని ఎమ్మెల్యే చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో రైతుల సెంటు భూమి పోనివ్వనని ఇది నేను ఇస్తున్న హామీ అని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, అల్లే గంగా సాగర్, అవారి శివకేసరి బాబు, నాయకులు వొళ్ళం మల్లేశం, సింగారావు, వల్లెపు మోగిలి, బీర్ ఎస్ పట్టణ అద్యక్షులు గట్టు సతీష్ తోపాటు పలువురు ఉన్నారు.