జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా!
కలెక్టర్, కమిషనర్ రావాలి అంటూ డిమాండ్ !
J.Surender Kumar,
జిల్లా కేంద్రమైన జగిత్యాల్ మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్. రద్దు చేయాలంటూ రైతుల నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారి 63 పై ధర్నా చేపట్టి రాస్తారోకో చేశారు. జిల్లా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ తమకు వద్దకు వచ్చే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం అంటూ ప్రకటన చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. దుబాయ్ లో జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, హస్నాబాద్, మోతె, రూరల్ మండలం నర్సింగపూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన గల్ఫ్ కార్మికుల మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసన ప్రదర్శన చేపట్టారు

మొదలైన సర్పంచ్ ల రాజీనామాలు !
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి అంటూ తిమ్మపూర్ గ్రామ సర్పంచ్ మేరుగు రమ్య -లక్ష్మణ్ పాలకవర్గం సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై అర్బన్ మం. మోతె గ్రామంలో రైతులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.,

ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, రైతులు చేస్తున్న నిరసనకు తన మద్దతు ప్రకటించారు.
