200 మందికి వైద్య పరీక్షలు!
J. Surender Kumar
ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవనంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. దాదాపు రెండు వందల మందికి పైగా హాజరై తమ ఆరోగ్య సమస్యల పరీక్షలు చేయించుకున్నారు. ENT oncology సూపర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అచ్యుత్ పానుగంటి, ప్రసిద్ధ urologist Dr. వివేక్ పానుగంటి ( ఇద్దరు సోదరులు ) . వైద్య పరీక్షలు నిర్వహించారు.

దాదాపు 200 మంది కి మూత్ర పరీక్షలు, స్కానింగ్ పరీక్షించాలు ఉచితంగా చేశారు.

వైద్య సేవలు అందించడం తమ భాగ్యం!

పుట్టి పెరిగిన స్వగ్రామం ధర్మపురి క్షేత్ర వాసులకు. వైద్య పరీక్షలు, నిర్వహించి అనారోగ్య సమస్యలు నిర్ధారించడం, ఆరోగ్య పరిరక్షణకై ముందుస్తూగా సలహాలు సూచనలు ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతం అని ప్రముఖ వైద్యులు డాక్టర్ అచ్యుత్, వివేక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానాలు చేశారు. స్థానిక లైన్స్ క్లబ్ , బ్రాహ్మణ సంఘం పక్షాన వైద్య సోదరులను ఘనంగా సన్మానించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు Dr రామకృష్ణ, D C జక్కు రవీందర్ లైన్స్ క్లబ్ సభ్యులు తమ వంతు సహకారం అందించారు. ఉదయం 10 గంటలకు ఆరంభమైన వైద్య శిబిరం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.
