J.Surender Kumar
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ ఒక్కరోజు రాజకీయ పబ్బం గడుపుకునెందుకు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం
మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి , మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటు, కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మా మున్సిపల్ పాలన ముగింపు సమయంలో మీకు 9 రోజులే సమయం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు తన పదవి ఎప్పుడు ఉడుతుందో తెలియనీ పరిస్థితి నెలకొందని విజయ లక్ష్మి ఎద్దేవా చేశారు.
గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ అమలుతో రైతులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముందు చూపుతో మాస్టర్ ప్లాన్ తో రైతులు తమ భూములపై హక్కులు కోల్పోవద్దని చెప్పారని గుర్తు చేశారు.
మాస్టర్ ప్లాన్ అమలు కోసం గ్రామ పంచాయితీలు తీర్మానాలు ఇచ్చాయంటు మున్సిపల్ చైర్ పర్సన్ చెప్పడంతోనే గ్రామాల సర్పంచ్ లు ఆందోళన చెంది ప్రజావాణికి వచ్చారని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు కాదని వివరించారు.
కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కౌన్సిలర్ నక్క జీవన్, తిప్పన్న పేట సర్పంచ్ మేరు గు రమ్య, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సిరాజొద్దిన్ మన్సూర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు పాల్గొన్నారు.