మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణికి మద్దతుగా సభ!

జిల్లాలనుంచి తరలి వచ్చిన పద్మశాలిలు!

J. Surender Kumar,

రాజీనామా చేసిన జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ కు మద్దతుగా ఆదివారం జగిత్యాలలో సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. పట్టణంలోని అంగడి బజార్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పద్మశాలి రాష్ట్ర, జిల్లాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, బిసీ సంఘాల నాయకులు తరలి వచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, దొర అహంకారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చైర్ పర్సన్ భోగ శ్రావణి పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగ శ్రావణి ని తిరిగి చైర్ పర్సన్ గా నియమిస్తూ మిగతా 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
మార్కండేయ దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించి తహసిల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి వినతిపత్రం అందజేశారు