ఆన్లైన్ టెండర్ లోసుగులు అడ్డుపెట్టుకొని…
అడిగేది ఎవరు ? అడ్డుకునేది ఎవరు ?
J. Surender Kumar,
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో దేవుళ్లకు నాసిరకం సరుకులతో నైవేద్యాలు, భక్తులకు ప్రసాదాలు అందుతున్న దుర్భర దుస్థితి నెలకొందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ టెండర్ సరుకుల కొనుగోలు ప్రక్రియలో ఉన్న నిబంధనలు కొందరు ఆలయా అధికారుల, వ్యాపారుల పాలిట వరంగా మారిందనే చర్చ జరుగుతోంది.
ఆలయాలకు సరుకులు కొనుగోలు తీరు తెన్నులు పరిశీలిస్తే నాణ్యత ప్రమాణాలు గల సరుకుల సరఫరా స్థానంలో, నాసిరకం సరుకులు సప్లై అవకాశాలు అధికంగా ఉందనే చర్చకు అవకాశం ఏర్పడింది.
వివరాలు లోకి వెళ్తే
ఆలయాలలో దేవుళ్లకు నిత్య నైవేద్యాలు, ప్రసాదాల అమ్మకాలు, భక్తులకు ఉచిత అన్నదానం తయారీకి సంవత్సర కాలం పాటు నిత్యవసర సరుకులను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు.
టెండర్ ప్రకటనలో బ్రాండెడ్ కంపెనీల సరుకులు మాత్రమే సప్లై చేయాలని, ఆయా సరుకుల బ్రాండ్ లు పేర్కొంటూ, టెండర్ లో ప్రకటిస్తారు. టెండర్ కైవసం చేసుకున్నవారు అవే సరుకులను సప్లై చేయాల్సి ఉంటుంది.
టెండర్ ప్రకటనలో పేర్కొంటున్న కొన్ని సరుకులు వివరాలు!
1). ఖజు (JH బ్రాండ్ రెండు పీసులుకలపి ఉన్నది). 2) కారం పొడి (ఆశీర్వాద్ బ్రాండ్) 3) పసుపు (స్వస్తిక్ బ్రాండ్) 4) ఉప్పు (అన్నపూర్ణ బ్రాండ్) 5) గోధుమపిండి (అన్నపూర్ణ బ్రాండ్) 6) టీ పొడి (జెమినీ బ్రాండ్) 7) హారతి కర్పూరం (స్వస్తిక్ బ్రాండ్) 8) తేనె (నెంబర్ వన్ గిరిజన బ్రాండ్) 9) నూనె (గోల్డ్ డ్రాప్ బ్రాండెడ్) 10) కుంకుమ (నోము బ్రాండెడ్) 11) అగర్బత్తులు ( పద్మిని బ్రాండెడ్) 12) పంచదార .(బోధన్ లేదా. గాయత్రి బ్రాండెడ్) 13) శనగపప్పు (క్యామెల్ బ్రాండ్).14) బియ్యం ( ఓల్డ్ బిపిటి బ్రాండ్) 15) చీపురు (బొంబాయి బ్రాండ్).16) బ్లీచింగ్ పౌడర్ (శ్రీకృష్ణ కంపెనీ బ్రాండ్) 17) యాసిడ్ (MEPL బ్రాండ్) 18) సెంటెడ్ ఫినాయిల్ ( Pedilite Mr .Perfect బ్రాండెడ్) లతో పాటు విద్యుత్ పరికరాలు( ఫిలిప్స్ కంపెనీ, నాకొడ బ్రాండ్ వైర్లు) కలుపుకొని దాదాపు 100 కు పైగా వస్తువులు ఆయా కంపెనీల బ్రాండ్ లు పేర్కొంటూ సరుకుల సరఫరా చేయాలని టెండర్ ప్రకటనలో పేర్కొంటారు.
నాసిరకం సరుకుల సరఫరా ఇలా ?

నెల రోజులకు సరిపడే సరుకుల వివరాలు పేర్కొంటూ సరఫరాదారుడికి మెయిల్, లేదా వాట్సప్ లో సరుకుల వివరాలు క్వాంటిటీ, లిస్టు పంపిస్తారు . హైదరాబాదు నుండి ఆలయ గోదాములలోకి చేరిన సరుకుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించే వారు ఉండరు. కేవలం దిట్టం నిర్వహించే ఉద్యోగి,. కార్యనిర్వహణాధికారికి, సప్లై చేసేవారికి. మాత్రమే సరుకుల క్వాలిటీ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ( ఇక్కడే నాసిరకం సరుకులను ఉదాహరణకు, గోల్డ్ డ్రాప్ ఆయిల్ స్థానంలో, పామాయిల్ లేదా మామూలు నూనె, ఖజు J.H బ్రాండ్ , రెండు పీసులు కలిపి ఉన్న కాజుకు బదులు, కాజు పలుకులు,. యాలకులు, ఆకుపచ్చ నెంబర్ వన్ కు బదులు సెకండ్ క్వాలిటీ, పసుపు, స్వస్తిక్ బ్రాండ్ కు బదులు సెకండ్ క్వాలిటీ. తదితర నాసిరకం) సరుకులు సప్లై దారుడు చేస్తారు. స్వామివారికి నైవేద్యం, భక్తులకు ప్రసాదాల, ఉచిత అన్నదానం కోసం. ఈ సరుకులనే వినియోగిస్తారు. సప్లై దారుడికి మాత్రం బ్రాండెడ్ సరుకుల కొనుగోలు ధరలు చెల్లిస్తూ, కొందరు అధికారులు సప్లైదారు నుంచి నెల నెల వేలాది రూపాయల కమిషన్ తీసుకుంటారు అనే
ఇదిలా ఉండగా ”ధిట్టం” ( సరుకుల నిలువలగోదాం) పర్యవేక్షించే ఉద్యోగి ప్రతి నెల ఆలయ అధికారికి, తప్పనిసరిగా ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆ మొత్తం చెల్లించిన వారికే అక్కడ డ్యూటీలు కేటాయిస్తారని ఆలయ ఉద్యోగులు అనేకమంది ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. సరుకులు కొనుగోలు,వినియోగం వివరాలు ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.
15 రోజులకు ఓసారి రిజిస్టర్ తనిఖీ చేసి ఈ ఓ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.

ప్రసాదాల తయారీలో చేతివాటం?
దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల గల సరుకుల వినియోగించాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి.
10 కిలోల శనగపిండితో లడ్డు తయారీలో వాడాల్సిన సరుకులు !
10 కిలోల శనగపిండి, 20 కిలోల పంచదార, 1/2 కిలో మిస్రీ
1/2 కిలో కిస్మిస్, ముప్పావు కిలో ఖాజు, ఆరున్నర కిలోల నెయ్యి, 75 గ్రాముల యాలకులు, 15 గ్రాములు జాజికాయ, 10 గ్రాముల పచ్చ కర్పూరం. వినియోగించాల్సి ఉంటుంది.
పులిహోర..
10, కిలోల తయారీకి!
10 కిలోల బిపిటి పాత బియ్యం, అర్ధ కిలో శనగపప్పు, అర్ధ కిలో మినప్పప్పు, అర్ధ కిలో పల్లీలు, 0.50 గ్రాముల పసుపు, కిలోన్నర నూనె, కిలోనర చింతపండు, 200 గ్రాముల ఎండుమిర్చి, కిలో ఉప్పు, 100 గ్రాముల జిలకర, 200 గ్రాముల ఆవాలు, 0.5 గ్రాముల మెంతులు, 10 గ్రాముల మిరియాలు, 0.04 గ్రాముల ఇంగువ, వినియోగించాల్సి ఉంటుంది.
ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ , కల్తీ నిరోధక శాఖ అధికారులు గాని తనిఖీ సందర్భంలోనే ఇందులో వినియోగించిన సరుకులు వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాంటి తనిఖీలు జరిగిన సందర్భాలు లేవనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
