J. Surender Kumar,
నకిలీ లా డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి, గత 11 ఏళ్లుగా న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు న్యాయవాదులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత .2023, జనవరి రెండవ వారంలో తుళ్లూరు, పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు న్యాయవాదులపై రెండు ఫిర్యాదులు చేశారు.. ఈ మేరకు బిక్కి నాగేశ్వరరావు (35), వెంకటేశ్వర్లు సత్తెనపల్లిలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, శ్రీనివాస, కాకినాడలో న్యాయవాద చాముదేశ్వరి. తెనాలి నుంచి, సీఎస్‌ఎస్ మూర్తి ,తునికి చెందిన న్యాయవాద విద్య పూర్తి చేయకుండా తప్పుడు సర్టిఫికెట్లు తో. కొనసాగుతున్నారని. బార్ కౌన్సిల్ ఫిర్యాదులో పేర్కొంది.
నిందితులపై IPC సెక్షన్లు 120(B) (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467, 468 (ఫోర్జరీ), 471 r/w 34 సహా నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి విద్యార్హత వివరాల సమాచారం పొం దడానికి పోలీసులు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు అధికారిక ఇమెయిల్‌లు పంపారు.
రాష్ట్రంలోని వివిధ చోట్ల ప్రాక్టీస్ చేస్తున్న నకిలీ న్యాయవాదులపై అనేక ఫిర్యాదులు అందడంతో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచారణ ప్రారంభించింది. అనుమానాస్పదంగా ఉన్న 15 మంది న్యాయవాదుల విద్యార్హత సర్టిఫికెట్లను గుర్తించారు. ఈ 15 మంది న్యాయవాదులు క్రాస్ చెక్ చేయడానికి విశ్వవిద్యాలయాలకు బార్ కౌన్సిల్ లేఖలు రాసింది.
న్యాయవాదులు తమ కళాశాలలో వారి పేర్లు నమోదు కాలేదని, యూనివర్సిటీలు వారికి ఎలాంటి లా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయలేదని యూనివర్సిటీలు, కౌన్సిల్‌కు తెలియజేశాయి. విచారణ అనంతరం 15 మంది న్యాయవాదులలో ఎనిమిది మంది తమ ఎన్‌రోల్‌మెంట్‌ను స్వచ్ఛందంగా సరెండర్ చేసినట్లు తెలిసింది.