10 మంది మృతి, 16 మందికి గాయాలు
బస్సు ట్రక్కును ఢీ
J.Surender Kuma
నాసిక్-షిర్డీ హైవేపై పఠారే గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బస్సు మరియు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నా ప్రమాదంలో పదిమంది మృతి చెందగా 16 మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం
ఈ బస్సులో 50 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా షిరిడీ దర్శనానికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది దుర్మరణం చెందగా, 16 మంది గాయపడ్డారు.
థానే జిల్లా అంబర్‌నాథ్ నుంచి అహ్మద్‌నగర్ జిల్లా షిర్డీకి ప్రైవేట్ బస్సు వెళ్తోందని పోలీసు అధికారులు తెలిపారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలో నాసిక్‌లోని సిన్నార్ తహసీల్‌లోని, పఠారే శివర్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి వార్తా సంస్థకు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారు.
క్షతగాత్రులను సిన్నార్ రూరల్ ఆస్పత్రికి, యశ్వంత్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గతంలో ఇలానే ప్రమాదాలు!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ ప్రాంతంలోని షిర్డీ హైవే పై గతేడాది నవంబర్‌లో ఘోర .రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలో నివసించే కొందరు సాయి భక్తులు సాయిబాబా దర్శనం చేసుకుని అక్కడి నుండి త్రయంబకేశ్వరానికి వెళ్తున్న షిర్డీకి వెళ్లారు. అయితే వారి కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు సాయి భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గతేడాది అక్టోబర్‌లో నాసిక్ నుంచి పూణె వెళ్తున్న ట్రక్కును యవత్‌మాల్ నుంచి ముంబై వస్తున్న బస్సు . ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి, 10 మంది మరణించారు మరియు 21 మంది గాయపడ్డారు.