నేడు స్టీఫెన్ హాకింగ్ జయంతి !

ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సైన్స్ పరిశోధనలో నోబెల్ బహుమతిపొందకపోయినప్పటికీ ఖగోళ భౌతిక శాస్త్రం లో ఆయన పరిశీలించి చేసిన ప్రతిపాదనలు యువ ఖగోళ భౌతిక శాస్త్ర వేత్తలకు కొత్త దారిని చూపాయి. సృష్టి యొక్క ఆవిర్భావం అకస్మాత్తుగా జరగలేదని,విశ్వం నిరంతరం విస్తరిస్తోందని ఆయన వివరించారు.
“అన్ని అవయవాలు బాగున్నా లేని లోపాలు ఊహించుకొని ఏమీ సాధించలేమని భాదపడిపోతుంటారు చాలామంది ప్రజలు.కాని కదలడానికి సహకరించని శరీరం,చక్రాల కుర్చీకే పరిమితమైన జీవనం,మాట్లాడటానికి కూడా కంప్యూటరే ఆధారం .,మోటర్ న్యురాన్ అనే భయంకరమైన వ్యాధి శరీరాన్ని కబలిస్తున్న చలించక తనలోని లోపాన్ని ఆయుధంగా మార్చుకొని కృష్లబిలాలపై (బ్లాక్ హోల్స్ పై )ప్రయోగాలు చేస్తూ ఎంతో ఆయన విలువైన సమాచారాన్ని కనుగొన్నాడు.

అసలు కృష్ణ బిలం అంటే ఏమిటి?? అనంత విశ్వంలో భయకరమైన నల్లని బిలాలు వున్నాయి. నక్షత్రాలు ఈ బిలాలలోనికి చేరినప్పుడు ఆశ్చర్యంగా తమ కాంతిని కోల్పోయి అంతర్థానం అయిపోతున్నాయి.దీనికి కారణం చాలా మంది శాస్త్రవేత్తలకు అర్థంకాలేదు.1970 లో క్వాంటమ్ థియరీ,జనరల్ రిలేటివిటీ లను ఉపయోగించి కృష్ణబిలాలు రేడియోషన్స్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు.వీటినే హాకింగ్స్ రేడియన్స్ గా పిలుస్తారు.1971 లో బిగ్ బ్యాంగ్ థియరీ మీద అనేక పరిశోధనలు చేసి ఎంతో విలువైన విషయాలను కనుగొన్నాడు. 1984 లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అనే పుస్తకాన్ని రచించారు.ఇది అతి తక్కువ సమయంలోనే అత్యథికంగా అమ్ముడైన పుస్తకంగా రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.
అలాగే జీవన మరణాల గురించి ఇలా చెబుతాడు హాకింగ్ ఉన్నది మనకు ఒక్కటే జన్మ.మన శరీరం కూడా కంప్యూటర్ లాంటిదే .దానిలో అనేక భాగాలుంటాయి. అవన్నీ పనిచేయడం మానేస్తే ఇంక ఇది పని చేయదు. అలాగే మనశరీరంలోని అవయవాలన్నీ ఒక్కొక్కటి పనిచేయడం ఆగిపోతే చివరికి మెదడు కూడా పనిచేయడం మానేస్తుంది..ఇదే మరణం..దీనికోసం అందరూ ఎదురుచూడాల్సిందేనని ఆయన అంటారు
.

1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లండ్లోజన్మించారు1962లో తన 20 వ యేట వచ్చిన ఈ భయంకర వ్యాధి తో 76 సంవత్సరాలు జీవించాడంటే అతని ధృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో ఊహించండి. ఈ వ్యాధి సోకినప్పుడు కొన్ని నెలలకంటె ఎక్కువ బతకడు అన్న డాక్టర్ల మాటలకు వ్యతిరేఖంగా ఏకంగా 76సంవత్సరాలు జీవించడం అద్బుతం. 2018 మార్చి14న ఆయన తుదిశ్వాస విడిచారు.

మోటర్ న్యురాన్ వ్యాధి అంటే నరాలు పనిచేయక మెదడు కి శరీరానికి మధ్య సమన్వయం కోల్పోయి శరీరంమొద్దుబారిపోతుంది. ఇటువంటి అరుదైన వ్యాధిని తట్టుకొని నిలబడిన హాకింగ్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

వ్యాసకర్త: యమ్. రామ్ ప్రదీప్ జే వి వి,తిరువూరు
9492712836