కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్.
J. Surender Kumar,
జిల్లా కేంద్రమైన జగిత్యాల్ మున్సిపల్ పరిధిలో వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయింపులలో మున్సిపాలిటీ వారు వివక్షత చూపుతున్నారని 35 వార్డ్ స్వతంత్ర కౌన్సిలర్ కలెక్టర్ కు బుధవారం ఫిర్యాదు చేశారు.
TUFIDC – Phase -ll.,Go.Ms.No. 228. MA & UD (UBS) Dept., Dt: 23-04-2018 న ప్రతిపాదించిన వాటిలో ₹ 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్, , E.E, R&B, E.E. PH, R.D.O, Commissioner (Jagtial muncipality), D.E, కన్సెల్టంట్ సమ్మతించి ఆమోదం తెలిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమోదం తెలిపిన పనులను యధావిధిగా అమలు చేసి కేవలం మున్సిపల్ కు సంబందించిన ₹10 కోట్ల 84 లక్షల రూ,, అభివృద్ది పనుల మార్పులకు గల కారణాలు ఏమిటో ? ఆమోదం తెలిపిన పనులలో నా ” 8వ” వార్డు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ” 35వ”.వార్డు అభివృద్ధి పనులకు గాను ₹12, 20 లక్షలు కేటాయించారు అని ఆరోపించారు.

నిబంధన విరుద్ధంగా మార్పులు చేర్పులు చేసి చేసి కేవలం అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డు లలో ఒక్కో వార్డు కు ₹ “20” లక్షల రూపాయాల నుండి “₹ 35” లక్షల రూ,, ల వరకు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్ష కౌన్సిలర్ల కు సంబంధించిన వార్డులలో ఇద్దరు BJP వార్డులకు నిధులు కేటాయించి, ప్రతిపక్ష కౌన్సిలర్లు అయిన “8” మంది వార్డు లు 12, 13, 22, 30, 31, 35, 42 మరియు 46 వార్డులలో ఒక్క రూపాయి కూడ కేటాయించక పోవడం చాల భాదకరం అని పేర్కొన్న రు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ ను నా వార్డు పై వివక్ష చూపుతున్నారని, మూడు సంవత్సరాల కాలంలో కేవలం ₹ 5లక్షల నిధులతో అరకొర అభివృద్ధి పనులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి నడి బోడ్డున ఉన్న నా వార్డులో గత 45 సం,,ల క్రితం కట్టిన మురుగు కాలువతో ప్రజల ఇబ్బందులు, నిధుల మంజూరీకై గతంలో తమకు వినతి పత్రం ఇచ్చానని కౌన్సిలర్ పేర్కొన్నారు.

నేటి వరకు మున్సిపల్ అధికారులు ఎస్టిమేట్ చేయక జాప్యం చేస్తున్నారని, వెంటనే ఎస్టిమేట్ చేయించి పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు తో పాటు ఫోటోలను కూడా ఆమె జతపరిచారు.