మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.Surender Kumar,
ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ జగిత్యాల మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరి రవింధర్ రావు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఉద్యాన, ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో పెగడపెల్లి సింగిల్ విండో చైర్మన్ వోరుగంటి రమణా రావు వ్యవసాయ క్షేత్రంలో శనివారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం కేసీఆర్ గారి ముందు చూపుకు నిదర్శనం అని తెలిపారు.
వినూత్నముగా నూతన వ్యవసాయములో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ఒక శుభపరిణామం అని మంత్రి అన్నారు
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాక తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, చిన్న కమతాలలో పెద్ద పెద్ద ఆదాయాలు రావడం చూస్తున్నామని తెలిపారు.

ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందన్నారు, చెరకు, వరి మినహా అన్ని పంటలను ఇందులో అంతర పంటలుగా సాగు చేయొచ్చన్నారు. అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందొచ్చన్నారు.
జగిత్యాల జిల్లాలో పామ్ ఆయిల్ సాగుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలని మంత్రి కోరారు. ఆయిల్ పామ్ సాగులో జగిత్యాల జిల్లా మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలపాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధి శాఖా అధికారులు. ప్రజా ప్రతినిధులు ప్రజలలు పాల్గొన్నారు