పట్టణానికి 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు!

రెండు నెలలలో పంపిణీ!
మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరణ!
జగిత్యాల జిల్లా కలెక్టర్!

J. Surender Kumar

జగిత్యాల పట్టణానికి రాష్ట్రములో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ పట్టణం తరువాత జగిత్యాల పట్టణానికి 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయి 90 శాతం నిర్మాణం పూర్తి అయి రెండు నెలల్లో పంపిణీ కి సిద్దం అని జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేకుండా  నివసించే పట్టణ వాసులకు త్వరలో 4500 ఇండ్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు
ఇందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా ఇండ్లు లేని పేద ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది
ఇప్పటి వరకు ఇండ్లు లేకుండా  దరఖాస్తులు చేసుకొని పేద వారు రేపటి వరకు జనవరి 8వ తేదీ వరకు మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి
జనవరి 8 వ తేదీ వరకు దరఖాస్తులు మీ సేవ  కేంద్రాలలో చేసుకోవడానికి అవకాశం
ప్రజావాణి లో ఇచ్చిన డబులు బెడ్ రూమ్ దరఖాస్తులు పరిగణించబడవు
కేవలం మీ సేవ ద్వారా చేసిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది
జనవరి 8వ చివరి తేదీ తర్వాత చేసిన దరఖాస్తులు   పరిగణించబడవు అని ప్రకటనలోపేర్కొన్నారు.
దరఖాస్తుల అనంతరం లబ్ధిదారులు దరఖాస్తు దారులు చేసుకున్న దరఖాస్తులను వార్డుల వారీగా విభజించి జిల్లా అధికారుల బృందంతో పరిశీలించడం జరుగుతుంది
ఈ పరిశీలన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా రూపొందించడం జరుగుతుంది కలెక్టర్ స్పష్టం చేశారు.


టీఎన్జీవో క్యాలెండర్ 2023 ఆవిష్కరణ!


జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవిటి.ఎన్.జీ.ఓ. ల సంఘం 2023 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.   టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు బోగ శశిధర్,  జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోలు జిల్లా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఉద్యోగుల నిరంతర  కృషి వలననే  జగిత్యాల జిల్లా అన్నిరంగాలలో ముందు వరుసలో ఉన్నదని,  అలాగే ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎన్జీవోల సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కొనియాడారు.  ఉధ్యోగులందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు అమరేందర్ రెడ్డి, షాహిద్ బాబు,  రవిచంద్ర, రవీందర్, ముదాం రవి, శ్రీనివాస్ స్వామి, రాజేందర్, రవి కుమార్,  సుగుణాకర్, మధుకర్, హరి ప్రసాద్, సునిత్,  మమత, శైలజ, విజయ్ కుమార్, పూర్ణచందర్, గణేష్, మహేష్, యషస్వి, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.