పవన్ కళ్యాణ్ పర్యటనలో… ఆలయాలలో లాఠీ ప్రసాదం ..

స్టేట్ పోలీసులా ?  సేన పోలీసులా ?

J. Surender Kumar,

జనసేన అధినేత , ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు, ధర్మపురి ఆలయాల పర్యటనలో, పాత్రికేయులకు ఆయన అభిమానులకు పోలీసులు లాఠీ ప్రసాదం అందించారు, అవమానించారు. ఆలయ ప్రాంగణంలో అసభ్య పదజాలాన్ని ఉచ్చరించారు.  పోలీసులు పవన్ కళ్యాణ్ ముందు అతి ఉత్సాహంతో ప్రదర్శించిన  తీరు తో వీరు  స్టేట్ పోలీసులా ,?  సేన పోలీసులా ? అనే చర్చ నెలకొంది.

అభిమానులను లాగుతున్న దృశ్యం


వివరాలలోకి వెళ్తే.


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, ఆలయ ప్రాంగణంలోని  ఆశీర్వచన మంటపంలో సన్మానించారు. ఈ కార్యక్రమం తిలకించడానికి, భారీ సంఖ్యలో అభిమానులు, వార్తా సేకరణ కోసం కొందరు పాత్రికేయులు అక్కడ ఉన్నారు. జగిత్యాల డిఎస్పి, ఆయనతో పాటు మరో అధికారి    అక్కడ గుమ్మడిన వారిని చేతులతో చెదరగొట్టారు. డీఎస్పీ ప్రకాష్ లాఠీలతో  కాళ్లపై కొట్టడం ప్రారంభించారు. దీంతో అభిమానులు, కొందరు పాత్రికేయులు, ఆలయం నుండి బయటికి పరుగులు తీశారు.

యమధర్మరాజు ఆలయం దగ్గర హెచ్చరికలు చేస్తున్న డీఎస్పీ

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఇదే ప్రాంగణంలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా  బయటకు వెళ్లి తన వాహనంలో కూర్చున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ముందుగా
యమధర్మరాజును దర్శించుకున్నారు. ఈ సమయంలో కొందరు అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ, జై పవన్ కళ్యాణ్, అంటూ నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన డి.ఎస్.పి  ఆలయ ప్రాంగణంలో అభిమానులను  అసభ్య పదజాలంతో దూషించారు.
పవన్ కళ్యాణ్ ,కొండగట్టు ఆలయ సందర్శన సమయంలోను డి.ఎస్.పి ఆలయ ప్రాంగణంలో ఉన్న అభిమానులను, భక్తులను, పాత్రికేయులను బలవంతంగా బయటకులాగి వేశారు.

భారీ బందోబస్తు ఇలా..
వారు విఫలమైంది ఎలా ?

పవన్ కళ్యాణ్ అంగరక్షకులు


పవన్ కళ్యాణ్ ధర్మపురి పర్యటనలో ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సిఐలు,  13 మంది ఎస్ఐలు, 160 మంది హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ , హోంగార్డ్స్ ( కలుపుకొని) జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ధర్మపురి పర్యటనలో అంగరక్షకుల కవాతు

సోమవారం నుంచి భద్రత ఏర్పాట్ల కోసం పోలీసు అధికారులు, ధర్మపురి క్షేత్రానికి, ఆలయ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. క్రౌడ్ కంట్రోల్ కు, పాయింట్లు గుర్తించి ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులతో, అభివృద్ధి కమిటీ సభ్యులతో, చర్చించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.


ఆలయంలోకి భారీ సంఖ్యలో అభిమానులు ఎలా రాగలిగారు ? ఎవరు అనుమతించారు. ?  నియంత్రణలో ఎవరిది వైఫల్యం ? అనే విషయం పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దీనికి తోడు. పోలీస్ బలగాలతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంగరక్షకులు ( బౌన్సర్స్) ధర్మపురి పట్టణంలోనూ, ఆలయంలో, ఆయన వెన్నంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, వారే అభిమానులు, పాత్రికేయుల పట్ల వారు దురుసు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

కొండగట్టు క్షేత్రంలో లాగుతున్న దృశ్యం

కానీ, స్టేట్ పోలీసులే అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రవర్తించిన తీరు తెన్నులను పలువురు విమర్శిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చేసుకుని  భవిష్యత్తులో ఆలయ ప్రాంగణం, పరిసరాలలో పోలీసులు లాఠీలతో అతి ఉత్సవం ప్రదర్శించకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.