కొండగట్టు క్షేత్రం లో పర్యటన గోప్యమా?
చంద్రబాబు పర్యటనలో జరిగిన అపశృతి భయమా?
J. Surender Kumar
ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, పర్యటన కోసం, వాడనున్న నూతన ‘వారాహి ‘ వాహనం కు ఆదివారం కొండగట్టు క్షేత్రంలో పూజ ఉందా ? లేదా ? అనే సందిగ్ధత అభిమానులలో, అధికార యంత్రాంగంలోను నెలకొంది . కొన్ని రోజుల క్రితం కందుకూరులో, నూతన సంవత్సరం ఆదివారం గుంటూరు లో చంద్రబాబు పర్యటనలు చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటనలో మొత్తం 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఆ భయం కారణమైందా ? లేదా పర్యటన వివరాలను గోప్యం పాటిస్తు న్నారనే చర్చ నెలకుంది.

ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో అభిమానులు సంఖ్య గణనీయంగా ఉంది, భారీ సంఖ్యలో అభిమానులు, ముక్కోటి ఏకాదశి రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తరలివచ్చే భక్తజనంతో కొండగట్టు క్షేత్రం కిక్కిరిసిపోతుందని ముందస్తు సమాచారం మేరకు తన కార్యక్రమం వాయిదా వేసుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం అర్ధరాత్రి కొండగట్టు క్షేత్రానికి వచ్చి తెల్లవారుజామున పూజలు చేయించుకుంటారా? లేక ఏదో రోజు అర్ధరాత్రి కొండగట్టులో వాహనంకు పూజలు చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.
అభిమానికి ఫోన్లు!
జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని,చిరంజీవి కుటుంబ తో, సంబంధాలు ఉన్న ఒకరికి పలువురు ఫోన్లు చేస్తూ పర్యటన ఉందా ? అంటూ తెలుసుకుంటున్నట్టు సమాచారం.. అధికార యంత్రాంగంలో ఓ అధికారి కూడా ఆదివారం సాయంత్రం అతనికి ఫోన్ చేసినట్టు తెలిసింది.
నూతన వాహనం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసి ఆంధ్రప్రదేశ్ లో పర్యటన ఎన్నికల ప్రచారం చేస్తారని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం జనవరి 2 ముక్కోటి ఏకాదశి రోజున పవన్ కళ్యాణ్ వాహనంకు పూజలు చేయిస్తారని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఈ చెక్కర్లు కొట్టింది.
హీరో పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారం రాత్రి ,8 గంటల వరకు ఖరారు కానట్టు సమాచారం.