ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం!

సీఎం కేసీఆర్ దంపతుల ఆధ్వర్యం లో. . 

J. Surender Kumar,

వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు శోభమ్మ దంపతుల ఆధ్వర్యం లో  శుక్రవారం  ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది.

పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో  సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన  మహా భక్తురాలు  గోదాదేవి కళ్యాణ మహోత్సవం,
హిందూ సంప్రదాయం ప్రకారం..
ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి, తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.
ఈ కార్యక్రమంలో..

సీఎం సోదరీమణులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కోరుట్లలో..

కోరుట్లలో అతి పురాతనమైన శ్రీ  వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ ప్రదాన పూజారి బీర్నంది నరసింహా చారి, శ్రీనివాస్ చారి, పురోహితులు దివాకర్ శర్మ మరియు దేవాదయశాఖ ఈ. వో  విక్రమ్, నర్సయ్య, అద్వర్యం లో గోదా రంగనాథుల కల్యాణం భక్తుల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమనికి ఎం ఎల్ ఏ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,  సరోజన దంపతులు, మరియు పట్టణ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ దంపతులు, మాజీ కౌన్సిలర్ పుప్పాల ప్రభాకర్ పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రంలో…

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ శేషప్పకళావేదికపై  శుక్రవారం శ్రీ గోదారంగనాథులస్వామి వారి కళ్యాణం మరియు శ్రీ స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వస్థి పుణ్యాహవాచనం, శ్రీపురుషసూక్తం , లక్ష్మీ సూక్తం తో అభిషేకం హారతి మంత్రపుష్పం తదితర పూజాది కార్యక్రమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, గందె పద్మ శ్రీనివాస్, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.