ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
(J. Surender Kumar)
మాస్టర్ ప్లాన్ ప్రజల సౌకర్యార్థం కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని,ప్రజల అభీష్టం మేరకే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, అసత్య ప్రచారం నమ్మవద్దని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
బుధవారం పట్టణంలో 10వ వార్డు ఎలుక బావి వార్డు,గంగ పుత్ర సంఘ భవన నిర్మాణానికి CDP నిదులు ₹.5 లక్షల తో భుమి పుజ చేసి ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు.
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడిక తీసి, కట్ట బాగు చేసుకున్నాం. గతంలో చెరువులను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్లనే నేడు చెరువుల జల కల సాధ్యం అయిందని అన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా గంగ పుత్రులకు ఉపాధి.
గంగ పుత్రులు మోపెడ్ లు, వ్యాన్ లు,. లైఫ్ జాకెట్ లు పంపిణీ ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెందుతుంది. అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా, వరద కాలువ జీవ నది ల మార్చి, గ్రామాల్లో చెక్ డ్యాం ల నిర్మాణం ద్వారా నేడు రాష్ట్రం లో,.జగిత్యాల నియోజకవర్గం లో భూగర్భ జాలాలు పెరిగాయి. అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం.పెరిగిన మత్స్య సంపద గంగ పుత్రులు కళ్ళ లో ఆనందం. అనిపిస్తుంది అన్నారు
గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే నేడు పట్టణ మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తం మారిందని యావర్ రోడ్డు విస్తరణ ను గతంలో మంత్రులు గా ఉండి చేయలేక పోయారని, నేడు 1000 మీటర్ల పైన వెడల్పు చేశామని నూతన నిర్మాణాలు 100 ఫీట్ లలో జరుగుతున్నాయి అని ప్రజలు గమనించాలని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని అదైర్య పడవద్దని అన్నారు.