జిల్లా కలెక్టర్ జి. రవి
J. Surender Kumar,
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 42 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి
కార్యక్రమంలో జిల్లా అదునపు కలెక్టర్లు బిఎస్ లతా . మంద. మకరంద, ఆర్డీవోలు మాధురి .వినోద్ కుమార్ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ లో కంటి వెలుగు కేంద్రం ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ లో ఎక్కువమంది ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలలో కంటి వెలుగు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాన్ని అనుసరించి కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం కలెక్టర్ జి. రవి కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రధానంగా ఎక్కువ మంది పనిచేస్తున్న కార్యాలయాల్లో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి కంటి పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉండే విదంగా కంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సమయానుకూలంగా వారి కార్యాలయంలోనే పరీక్షలు చేయించుకోవచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగపరుచుకోవాలని . అన్నారు కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను అనుసరించి ఆ కేంద్రము ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలో నిర్ణయించడం జరుగుతుంది అని అన్నారు. ఇదే మాదిరిగా జిల్లా న్యాయస్థానం సముదాయంలో, పోలీస్ శాఖలో కూడా ఇలాంటి కేంద్రంను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి శ్రీధర్, జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి స్వామి, డెమో టి. రమణ, హెచ్.ఈ. కె.భూమేశ్వర్, కంటి వెలుగు జిల్లా కో ఆర్డినేటర్ మురళి, వైద్యాధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు
మన ఊరు మన బడి !

వీడియో కాన్ఫరెన్స్ లో మన ఊరు మన బడి, డబల్ బెడ్ రూమ్ లు వెరిఫికేషన్ , రిపబ్లిక్ డే ఖిల్లా లోని పనులను త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి వెలుగు సెంటర్లను ప్రగతి నివేదికల వివరాలు అడిగారు.