ప్రతిభను వెలికి తీయడానికే యువజన ఉత్సవాలు!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

J. Surender Kumar

యువతను ప్రోత్సహించి వారి శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పెర్సన్ డాక్టర్ బోగ శ్రావణి అన్నారు.
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని SKNR కళాశాలలో ఏర్పాటు చేసిన 2023- జిల్లా స్థాయి యువజనోత్సవాలను బుధవారం వేరు ప్రారంభించారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువత మంచి ప్రదర్శన కనపరిచి రాష్ట్ర స్థాయిలో జగిత్యాల జిల్లాకు పేరు తేవాలని కోరారు. అనంతరం విజేతలకు మెమొంటోలు అందజేశారు. జాతీయ నేతల వేషధారణతో వారిని అభినయిస్తూ సాగిన రూపకాలు, బృందగానాలు, డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లతో అలరించాయి


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత ,సంక్షేమ శాఖ అధికారి డా నరేష్ . ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ,పట్టణ పార్టీ కార్యదర్శి ప్రశాంత్ రావు, ప్రిన్సిపల్ అశోక్ ,విష్ణు, రాజేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ!


పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి-2023 నూతన సంవత్సర క్యాలండర్ ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు, కార్యవర్గ సభ్యులు, వెలమ కుల సభ్యులు,.తదితరులు పాల్గొన్నారు.

పరామర్శలు


జగిత్యాల పట్టణ మార్కెట్ లోని వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్ మంచాల లవకుమార్ సోదరుడు భాస్కర్ అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస. తదితరులు ఉన్నారు.

జిల్లా మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ఆనంద్ తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పరామర్శించారు., ఆయన వెంట నాయకులు వోద్ది రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు.


రాయికల్ పట్టణ బి అర్ ఎస్ నాయకులు అనుమల్ల రవితేజ రామాజి పెట్ గ్రామనికి చెందిన సుమిత్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాల లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు.