రామాలయంలో  ‘కూడారై పాయసం’ నివేదన !

(J.Surender Kumar)

జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో. భాగంగా.బుధవారం గోదా రంగనాథ స్వామి వారికి జరిగిన కూడారై ఉత్సవం నిర్వహించారు.

ఇందులో  భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం స్వామి వారికి 108 గంగాళాల లో  కూడారై పాయసం నివేదన . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తజనం పాల్గొన్నారు.

ముక్కోటి దాతలకు కృతజ్ఞతలు!

ముక్కోటి ఏకాదశి పర్వదిన పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూల వేదిక,లైటింగ్ తదితర అవసరాల నిమిత్తం లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చిన  దాతలకు ఆలయ కార్యనిర్వహణాధికారి అభివృద్ధి కమిటీ సభ్యులు   ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


ఓగుల అజయ్ ₹ 1.50 లక్షలు, బచ్చు అనిల్ ₹ 50,000/- దామెర రామ్ సుధాకర్ రావు, ₹50,000/- గదే రామకృష్ణ,₹ 50,000/- బెజగం వెంకటేశం, ₹ 60,000/- పోనకం విజయకుమార్, ₹25,000/-. వడ్లూరి కరుణాకర్, ₹ 25,000/- దాతల పేర్లు ప్రకటనలో పేర్కొన్నారు.