అర్ధరాత్రి ఏటీఎం దొంగలను చేజ్ చేసిన పోలీసులు!
₹ 19 లక్షల నగదు చోరీ ని అడ్డుకున్న కోరుట్ల పోలీసులు!
J. Surender Kumar,
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాత్రి ఒంటిగంట సమయంలో SBI బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీకి విఫల యత్నం చేసిన దుండగులను పోలీసుల అడ్డుకోవడంతో దొంగలించిన లక్ష రూపాయలలో. దాదాపు 3 లక్షల రూపాయలు కరెన్సీ రోడ్డుపై పడిపోయాయి.

ATM లొ చోరీ జరుగుతుందని అలారం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ వారు 100 నంబర్ కు డయల్ చేశారు. హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్సై సతీష్ కు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.

వెంటనే ఎస్సై సతీష్, బ్లూ కోల్డ్ సిబ్బంది ని అలర్ట్ చేసి ఏటీఎం రహదారి చుట్టూ రౌండ్ అప్ చేశారు. కారులో నగదు తో పారిపోతున్న దొంగలను పోలీసులు చేజింగ్ చేశారు. పరస్పర పెనుగులాటలో కరెన్సీ నోట్లు రోడ్డుపై పడిపోయినట్టు సమాచారం.

ఏటీఎం నుండి 19,00,200/- డబ్బులును పోలీసు స్వాధీన పంచుకున్నట్టు చర్చ. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది., ఏటీఎం చోరీ నిందితుల గురించి జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టట్టారు

SBI ATM లో ఉన్న డబ్బులను చోరీ కాకుండా నిలువరించిన పోలీస్ సిబ్బంది వివరాలు మెడి రాజయ్య, హెడ్ కానిస్టేబుల్ కోరుట్ల. గట్టు శ్రీనివాస్, కానిస్టేబుల్, కోరుట్ల మధు ప్రైవేట్ డ్రైవర్ లను జిల్లా ఎస్పీ సింధు శర్మ ఈ సందర్భంగా అభినందించారు.