(J. Surender Kumar)
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది.
ఉత్తమ ఒరిజినల్ పాట కేటగిరిలో నాటు, నాటు పాట అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు – 2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది.

ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకున్నాడు. కాగా ఒక ఇండియన్ సినిమాకు తొలిసారిగా ఈ అవార్డు దక్కడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ మూవీలో నాటు నాటు పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
