రైతుల పక్షాన ఉంటా మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తా!

అసత్య ప్రచారం నమ్మవద్దు. …..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

J. Surender Kumar,

నేను ఎప్పుడు రైతుల పక్షాన ఉంటాను, మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తా, అసత్య ప్రచారాలను నమ్మవద్దు, అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు.

జగిత్యాల మున్సిపల్ శివారు గ్రామాలైన శంకుల పల్లె, మోతే, నరసింగాపూర్ గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిదులు, నాయకులు, రైతులు, మహిళలు మంగళవారం ఎమ్మెల్యేను ఆయన క్వార్టర్స్ లో కలిశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వ్యవసాయ భూములను, వ్యాపార, రీక్రియేషన్ మరియు ఇతర జోన్ ల ,నుండి తొలగించాలని వాటిని యదా విధిగా కొనసాగించాలని వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు.

స్పందించిన ఎమ్మేల్యే రైతుల భూములను జోన్ ల నుండి తొలగిస్తామని, మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.