రైతులు ఆందోళనలో ఉంటే ఏం సాధించారని ఆత్మీయ సమ్మేళనాలు !

మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలి..


పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.!

J. Surender Kumar,

రైతులు సాగుకు నీరందక ఆందోళన చెందుతుంటే
ఏం సాధించారని ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటున్నారు
మరో నెల రోజుల ముందు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి ఉంటే సాగు నీరు అందేదని అన్నారు.
బీర్ పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్ట్ ను స్థానిక రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు., తూమును పరిశీలించారు. ప్రాజెక్ట్ లో ఎన్ని ఫీట్ల మేర నీరు ఉంటుంది., ఏ మేరకు నీరు నిల్వ చేస్తే చర్లపల్లి కి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని డీఈ ఈ చక్రు నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. తూముకు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
రోల్లవాగు ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పాలనలో రాజుల చెరువును 0.25 టీఎంసి ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందించామని గుర్తు చేశారు.
బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగు నీరు అందించామని జీవన్ రెడ్డి అన్నారు.
రోల్లవాగు ఆధునికీకరణ పేరుతో రు.60 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ ను మంత్రి బాధ్యతారాహిత్యంతో ఐదేళ్లు గడుస్తున్న పూర్తికాక పోవడంతో అంచనా వ్యయం
రు.130 కోట్లకు పెంచారని అన్నారు., వ్యవసాయానికి పెద్ద పీఠ వేస్తున్నామని చెప్పుకునే మంత్రులు రైతులు,మత్స్య కారులకు నష్ట పరిహారం అందించాలన్నారు.
ఏడాది పొడవునా సాగు నీరు అందించే సహజ సిద్దంగా ఏర్పడిన బుగ్గ చెరువును కనుమరుగు చేశారని ద్వజమెత్తారు.
ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రాజెక్ట్ తెగిపోయిందన్నారు.
కోట్లాది రూపాయల మత్స్య సంపద కొట్టుకుపోయి మత్స్య కారులు ఉపాధి కోల్పోయారని అన్నారు.
రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేసాయని, భూములు బీడుబారాయన్నారు.
ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని ప్రశ్నించారు.
మీ పై ఆరోపణలు చేయడం లేదు.. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
క్రాప్ హాలిడే ప్రకటించి, సాగు చేయని భూముల రైతులకు ఎకరానికి రు.20,000, ఒక్కో మత్స్యకార కుటుంబానికి రు.1 లక్ష పరిహారం అందజేయాలని అన్నారు.
కంటి వెలుగు శిబిరం లో పరీక్షలు చేసుకొని చూడండి కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో కనిపిస్తుంది అన్నారు., గోదావరి తీరప్రాంతాల్లో ఎత్తిపోతల ఏర్పాటు చేశాం.
ప్రజాప్రతినిధి నా వంతు బాధ్యతగా రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు రైతుల తో కలిసి ధర్నా చేపట్టామని అన్నారు.
మంత్రి జిల్లా పరిషత్ సమావేశంలో జనవరి 15 లోపి నీరు ఇస్తానని చెప్పిన ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కి తే, అధికారుల్లో చలనం వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎత్తిపోతలు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రం లో నిర్మించిన ప్రాజెక్ట్ నిర్వహణను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రోల్లవాగు ప్రాజెక్ట్ లో 224 ఫీట్ల మేర నీరు నిల్వ ఉంటేనే చర్లపల్లి కి నీరు అందే అవకాశం ఉందన్నారు.
ఆన్ అండ్ ఆఫ్ విధానం లో రోల్ల వాగు ప్రాజెక్ట్ కు మినహాయింపు ఇవ్వాలి అన్నారు. ఈ మేరకు సీఈ కి లేఖ రాస్తామన్నారు.
అరగుండ ల ప్రాజెక్ట్ కింద 2వేల ఎకరాలు, ఎత్తిపోతల కింద మరో 2వేల ఎకరాలు సాగు నిలిచిపోయాయి.
అరగుండాలు ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై భారం వేస్తూ ఏ సీ డీ చార్జీలు వేయడాన్ని నిరసిస్తూ వ్యవసాయానికి నిర్దిష్టమైన సమయంలో కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 31 న జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టే ధర్నా కు రైతులు, విద్యుత్ వినియోగ దారులు తరలి వచ్చి విజయవంతం చేయాలనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో బీర్పూర్ ఎంపీపీ మసత్తి రమేష్, జెడ్పిటిసి పాత రమేష్, వైస్ ఎంపీపీ బలుమూరీ లక్ష్మణరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చేరుపురి సుభాష్, ఎంపీటీసీలు రంగు లక్ష్మణ్, ఆడెపు మల్లేశ్వరి తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ నవీన్ రావ్, జితేందర్, జోగి రెడ్డి, తోట శ్రీనివాస్, బర్రె రాజన్న బదినేపల్లి శంకర్ అఖిల్ అభిలాష్ పాల్గొన్నారు.