శబరిమలై ఆలయ ఆదాయం ,₹ 310 కోట్లు!

ఆలయ బోర్డ్ చైర్మన్ అనంత గోపాలన్ వెల్లడి!

J. Surender Kumar,

కేరళ రాష్ట్రంలోని శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం గురువారం రోజు వరకు ₹ 310 కోట్ల.40. లక్షల రూపాయలు వచ్చిందని ఆలయ బోర్డు చైర్మన్ అనంత గోపాలం వెల్లడించారు.
అయ్యప్పన్ ఆలయ మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా శుక్రవారం సన్నిధానం దేవస్వామ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ ఏడాది మండల మండల కాలం ( 12-01-2023 వరకు) మొత్తం శబరిమలలో రూ.310 కోట్ల 40 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు..

ఇందులో మండల కాలంలో ₹231 కోట్లు మకర వీళకు కాలంలో ₹ 78 కోట్లు వచ్చాయి.  ఇందులో ప్రసాదాలు విక్రయం ద్వారా మండల కాలంలో దేవస్వాత్‌కు ₹ 107 కోట్లు, మకరవిళక్కు కాలంలో ₹ 32 కోట్లు వచ్చాయన్నారు.
వరుసగా 41 రోజుల పాటు అయ్యప్ప స్వామికి ప్రత్యేక నెయ్యభిషేకం, పూజలు కొనసాగాయని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 16వ తేదీ సాయంత్రం ఆలయ తెరిచారు.  కరోనా వ్యాప్తి కారణంగా శబరిమలలో గత రెండేళ్లుగా భక్తులకు దర్శనం కష్టంగా మారింది. ఈ సంవత్సరం, కరోనా ఆంక్షలు పూర్తిగా సడలించడంతో, శబరిమల మండలంలో మకరవిళక్కు పూజ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.