శరణు ఘోషతో మారు మోగిన శబరిగిరీలు!
J.Surender Kumar,
శబరిమల క్షేత్రం పొన్నంబలమేడ లో. అయ్యప్ప స్వామి భక్తులకు శనివారం సాయంత్రం ,6.45 నిమిషాల కు భక్తులకు మూడుసార్లు జ్యోతి దర్శనం కలిగింది. జ్యోతి దర్శనం కోసం శబరిమల చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల శరణుఘోషల తో శబరిగిరులు మార్మోగాయి. అరుదైన దృశ్యాన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు భక్తి ప్రపత్తుల తో పరవశించిపోయారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా.. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బందితో ఆ ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు.

శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం కు అభిముఖంగా ఉన్న పొన్నం బలమేడ 4 కిలోమీటర్ల దూరంనుంచి జ్యోతి దర్శనం కలిగింది.
ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. కాబట్టి నేటి నుంచే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి.

ప్రతి సంవత్సరం మకర జ్యోతి కనిపిస్తుంది. అయితే కేరళ ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులు పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. శనివారం సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజ వంశీయులు సన్నిధానం చేరుకున్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిచ్చింది..

భారీ బందోబస్తు !
శనివారం జ్యోతి దర్శనం సందర్భంగా 18 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకునే అవకాశ ఉందని పోలీసు అధికారులు అంచనాలతో భారీ ఏర్పాట్లు చేపట్టారు.
భద్రతా చర్యల గురించి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ మనోజ్ అబ్రహం మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు 6000 పోలీసులు అధికారులను నియమించామన్నారు, ఎరుమేలి గుండా అటవీ ప్రాంతంలో పెద్ద పాదం ద్వారా సన్నిధానం కు వచ్చే అయ్యప్ప లకు తీవ్రవాద సంస్థలు దాడులు చేయకుండా ,రక్షణ కల్పిస్తున్నామని, గతేడాది నీలకల్ పార్కులో 7,500 వాహనాలు, 19,000 కార్లు పార్కింగ్ చేశారన్నారు. ఈసారి నీలకల్‌లో పార్కింగ్ స్థలం నిండిపోవడంతో మిగిలిన వాహనాలను ఇతర చోట్ల పార్కింగ్ చేసి, బస్సుల్లో వచ్చే భక్తుల కోసం నిలక్కల్ నుంచి పంపా బస్ చైన్ సిరీస్ కొనసాగించామని ఆయన వివరించారు.
అయ్యప్ప స్వామినీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా!

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు శబరిమల కేసులో ఏకైక భిన్నాభి ప్రాయురాలు, జస్టిస్ ఇందు మల్హోత్రా శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. శబరిమల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సభ్యురాలు ఇందు మల్హోత్రా శుక్రవారం రాత్రి పంపా నుంచి అక్కడికి చేరుకుని ప్రార్థనలు చేశారు.
శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళలను అనుమతించాలన్న కేసులో తీర్పు సందర్భంగా మరో నలుగురు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా జస్టిస్ మల్హోత్రా మాత్రమే విభేదించారు.