సరుకులు కొనుగోలు లో నిబంధనలకు పాతర !
ఆలయ అధికారులకు జాతర !

కమిటీలు కనిపించవు- అధికారులు నియమించరు !

కాసులు కురిపించే కామధేనువు….

J. Surender Kumar,

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో సరుకు కొనుగోలు లో నిబంధనలకు పాతర వేస్తూ, కొందరు అధికారులు అందినంత దండుకుంటూ జాతర పండగ చేసుకుంటున్నారు. అత్యధిక శాతం ఆలయాలలో కొనుగోలు, పర్యవేక్షక కమిటీలు కనిపించడం లేదు. కమిటీలను. అధికారులు నియమించక ,నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదే అదనుగా ఆన్ లైన్ టెండర్ లో కొనుగోలు చేస్తున్న సరుకులకు అగ్రిమెంట్ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లింపులతో ఆలయాల ఆదాయాని కి కోట్లాది రూపాయల గండి కొడుతున్న కొందరు అధికారుల పాలిట కాసుల వర్షం కురిపించే కామదేనువు లా టెండర్ విధానం వారి పాలిట వరంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలో సాలీనా ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కలిగిన, దాదాపు 20 కి పైగా ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యం, ప్రసాదాల తయారీ, అమ్మకం, ఉచిత అన్నదాన నిర్వహణకు టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్న కోట్లాది రూపాయల సరుకులు ఆలయానికి సప్లై సందర్భంగా పాటించాల్సిన నిబంధనలకు అధికారులు పాతర వేయడంతో పాటు, పర్యవేక్షణ, కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేయకపోవడంతో అనేక ఆలయాల ఆదాయానికి గండిపడుతున్నది.
టెండర్ పొందిన సరకుల సప్లై దారుడు, ఆలయ అధికారులతోచేసుకున్న అగ్రిమెంట్ వివరాలు కొన్ని మాత్రమే !

ఆన్లైన్ టెండర్ ప్రకటనలోనే దాదాపు 42 నిబంధనలు పేర్కొంటారు. ఈ నిబంధనలను అంగీకరిస్తూ టెండర్ సొంతం చేసుకున్నా వ్యాపారి ఆలయం E.O తో అగ్రిమెంట్ చేసుకుంటారు.

టెండర్ నిబంధనలు అంగీకరిస్తూ వేళందారుడు నింపాల్సిన దరఖాస్తు

1) సంవత్సర కాలం పాటు ఇలాంటి నాణ్యత ప్రమాణాలతోనే పంపిణీ చేసే సరుకుల నమూనాల (శాంపుల్స్) ప్యాకెట్లు, సిల్ చేసి ఆలయానికి అందించాల్సి ఉంటుంది.
సరుకుల నాణ్యత ప్రమాణాలలో నాసిరకం గా అనిపిస్తే కమిటీ సభ్యులు శాంపిల్ ప్యాకెట్లతో వీటిని పరిశీలిస్తారు. పాలకవర్గం ధర్మకర్త మండలి లేని ఆలయాలలో. అర్చకుడు ఇద్దరు ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ( అధిక శాతం ఆలయాలలో ఇలాంటి కమిటీలే నియామకమే జరగలేదు, సరుకుల నాణ్యత ఎలా తెలుస్తుంది,)

టెండర్ లో పేర్కొన్న బ్రాండెడ్ సరుకుల శాంపిల్స్ ఇస్తానని అంగీకారం ప్యాకెట్స్

2) సరుకులను కొత్త గన్ని బ్యాగులలో ( తట్టు సంచులలో) మాత్రమే ప్యాక్ చేసి ఆలయాలకు రవాణా చేయాలి. ( The packing should be in new gunny bag only and also accordance with the provisions of packing act to avoid damages in transit).

సరుకులను గన్ని బ్యాగులలో(గోనె సంచులు) ప్యాక్ చేసి పంపాలని నిబంధన.

ధర్మపురి ఆలయంలో….

ధర్మపురి ఆలయ గోదాంలో ప్లాస్టిక్ సంచలలో సరుకులు

3) ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. ఆలయానికి ప్లాస్టిక్ సంచులలోనే సరుకుల ప్యాక్ చేసి సప్లై దారుడు పంపించిన ప్రశ్నించేవారు లేరు, పర్యవేక్షణ కమిటీ లేదు.

బియ్యం పప్పులు పల్లీలు ప్యాకింగ్ ఇలా ఉంది
నిబంధనల మేరకు సరుకులను ఇలాంటి గోని సంచులలో వినియోగించాలి

4) ఆలయ గోదాము కు చేరుకున్న సరుకులను, కమిటీ పర్యవేక్షించి, పరీక్షించిన తరువాత సరుకులు ఆర్డర్ చేసిన వివరాలు, క్వాంటిటీ, క్వాలిటీని పరిశీలించి ఆర్డర్ మేరకు సరుకులు ఉన్నాయా.? లేదా ?, టెండర్ లో పేర్కొన్న బ్రాండ్ సరుకులేనా ? అనేది నిర్ధారించిన పిదప వాహనం నుంచి సరుకులు అన్లోడ్ చేసి గోదాముకు తరలించాలి అనేది నిబంధన ( The committee will verify the material after verification of the material will be unloaded at devasthanam Paditharam Store. During transportation any damage towards the material will not take its to account)

సరుకుల పర్యవేక్షణ కమిటీ సభ్యులు నిర్ధారించిన తర్వాతనే అన్లోడింగ్ జరుగుతుందని నిబంధన

ఈ నిబంధన లు ఆలయ కార్యనిర్వహణాధికారి కి, దిత్తం నిర్వహించే ఉద్యోగికి తప్ప ఇతరులకు తెలియదు. అసలు కమిటీ నియామకం చేయకపోవడం ప్రస్తహనారం.

ఇది ఇలా ఉండగా ఆలయ గోదాంలో నిలువ సరుకులను, తయారీ ప్రసాదాలు, భోజన పదార్థాలను, ఫుడ్ ఇన్స్పెక్టర్ నెల రోజులకోసారి తనిఖీ చేసి నివేదికలు సంబంధిత శాఖ అధికారులకు పంపించాలి. లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా తనిఖీ చేయాల్సి ఉంటుంది.. 2017 జూలై నెలలో అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, ధర్మపురి ఆలయానికి రావడంతో ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసినట్టు రికార్డులలో నమోదయింది.

2017 జూలైలో గవర్నర్ నరసింహన్ ధర్మపురికి రాక


ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ఆలయాల లో స్వామివారి నైవేద్యానికి, ప్రసాదాల తయారీ సరుకులు నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని భక్తజనం కోరుతున్నారు.