J. Surender Kumar,
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా గా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా గానియమించబడిన భాస్కర్ శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శ సింధు శర్మ నుండి బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా పోలీస్ కార్యాలయమునకు చేరుకున్న ఎస్పీకి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….. సామన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడ సేవలందిచడంలో కృషి చేస్తాను అని అన్నారు. జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చర్యలు తప్పావని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు