తెలంగాణ వచ్చిన అభివృద్ధి జరగలేదు! కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు అభివృద్ధి చెందాయి!

కార్యకర్తల పోలింగ్ బూత్ సమ్మేళనంలో..
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి!

J.Surender Kumar

ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి, ఉద్యోగులు వస్తాయని ఆశించం అభివృద్ధి సంగతి ఏమోగానీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు మాత్రం అభివృద్ధి చెందాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.
ధర్మపురి పట్టణం లోని SRR గార్డెన్ లో శనివారం జెపి నడ్డ వర్చువల్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన, కెసిఆర్ ప్రభుత్వ పాలనపై పలు ఆరోపణలు చేశారు.


కామెంట్స్…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 60 వేల కోట్ల అప్పు ఉండే ఇప్పుడు 5లక్షల కోట్ల అప్పు అయింది కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు
రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్.
అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి అంటే మన బిజెపి ని బలోపేతం చేయాలి అన్నారు.
బీ ఆర్ ఎస్ నీ ఓడగొట్టే పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక బీజేపీ మాత్రమే అని ప్రజల్లో ఉందన్నారు.


అందరం కలిసి కట్టుగా పని చేద్దాం . కార్యకర్తలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి కలిసికట్టుగా పనిచేయడం వలనే  దుబ్బాక , హుజూరాబాద్ లో గెలిచాము. అన్నారు
తెలంగాణ ఆరంభంలో 10వేల కోట్ల మద్యం ఆదాయం ఉండే ఇప్పుడు 40వేల కోట్ల ఆదాయం ఉంది అని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నడు అని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.


గ్రామ గ్రామాన బెల్ట్ షాప్ లు పెట్టి ప్రజలను తాగుబోతులను చేసి ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని అంటున్నడు .
నెల నెలా 6000 వేల కోట్ల అప్పు చేసి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు. అన్నారు
ముఖ్యమంత్రి కేవలం కాంట్రాక్టర్ కోసం పనిచేస్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ 33వేల కోట్లతో పూర్తయ్యే దానిని లక్షా కోట్లు కు తెచ్చిండు అని ఆరోపించారు
కాంట్రాక్టర్లన్నీ మెగా కృష్ణారెడ్డి కే దక్కుతున్నాయి హైదరాబాద్ లో నడిచే కాంట్రాక్ట్ పనులన్నీ మెగా కృష్ణారెడ్డి వే అన్నారు.


తెలంగాణలో అవినీతి పాలనను అంతం మొందించాలంటే బిజెపి కార్యకర్తలు కష్టపడాలి అంటూ వివేక్ వెంకటస్వామి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.


కన్నం అంజయ్య  ఆగ్రహం!


రెండుసార్లు ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్యేగా పార్టీ నుంచి పోటీ చేసిన తనను పార్టీ కార్యక్రమాలలో విస్మరించడం,వేదిక పైకి పిలవకపోవడం ఏమిటి ?  అంటూ సురభి నవీన్ రావు ప్రసంగిస్తుండగా కన్నం అంజయ్య ఆగ్రహంతో ప్రశ్నించారు.
నవీన్ రావ్ అదే రీతిలో ప్రత్యుత్తరం ఇస్తుండగా. సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. పలువురు నాయకులు కార్యకర్తలు జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశం ముగిసిన తర్వాత  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తో, కన్నంఅంజయ్య, మరికొందరు వేదిక కింద వాదనకు దిగారు. ఇలాంటి విషయాలు పార్టీ అధిష్టానం వద్ద మాట్లాడుకుందాం ఇక్కడ అవసరం లేదు అంటూ వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి కదిలేరు, మరోసారి కార్యకర్తలు పెద్ద ఎత్తున జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.


వేదికపైకి నలుగురికే ఆహ్వానం!

రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలలో పోలింగ్ బూత్ సమ్మేళన కార్యక్రమంలో నిర్వాహకులు వేదికపై పలువురు సీనియర్ నాయకులను ఆహ్వానించడానికి లిస్టు సిద్ధం చేసుకున్నారు. చివరి క్షణాల్లో వేదికపై కేవలం నలుగురే ఉండాలంటూ బిజెపి అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, అసెంబ్లీ పాల్, సురభి నవీన్ రావు, అసెంబ్లీ ప్రబారి, సాంబయ్య, అసెంబ్లీ కన్వీనర్, కస్తూరి సత్యం లను  నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించినట్లు సమాచారం.