J. Surender Kumar
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తనపావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలు 23 మంది కి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఆదివారం వీరికి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు క్యాలెండర్ ఆవిష్కరణ.!

మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం వ్యవస్థాపక అద్యక్షులు దీటి అంజయ్య పటేల్ ఆద్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జగిత్యాల పట్టణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగాజడ్పీ చైర్ పర్సన్ ధావ వసంత సురేష్,. కుల బాందవులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మున్నూరు కాపులు అన్నీ రంగాలలో రాణించాలని అన్నారు. మున్నూరు కాపు వర్తక వ్యాపార రాబోయే రోజుల్లో సేవ కార్యక్రమాలు కూడ చేయాలని కోరారు. మున్నూరు కాపు లంత ఐకమత్యం తో కళ్యాణ మండపం పూర్తి చేయాలని కోరారు. దీనికోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్తాపక అధ్యక్షులు దీటి అంజయ్య పటేల్, సంఘ నాయకులు బండారి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జంగిలి రవి, కౌన్సిలర్ లు , బండారి నరేందర్, తోట మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, కూతురు శేఖర్, వోడ్నాల రాజ శేఖర్ ,
కిలాగడ్డ గంగన్న, భారతపు లింగా రెడ్డి, కొక్కు గంగాధర్, ములాసపు రాజన్న, నీరటి గంగారెడ్డి, కొక్కు రవి, అంగలి రాజన్న, ఆకుల నాగరాజు, రాచకొండ శ్రీనివాస్, తీగల సూర్య, జున్ను రాజేందర్, పుప్పాల ఉమాపతి, ,తిరంధాస్ శంకర్, జంగిలి మల్లికార్జున్, సాగర్, కొత్త నరేష్, పిట్ట పెద్ద రాజన్న, నర్శీంగఫూర్ మహేష్, చేవుల గంగన్న, జోన్నల గంగన్న, ,కొడారి రాజేందర్, మేళ్ళ గంగారాజం ,శీలం తిరుపతి, శీలం సురేంధర్, సిద్దం ధశరథం, బూసి రమేష్,కే ఉదయ్ కుమార్, శంకర్, వోడ్నాల రవీందర్, పుప్పాల రాజేందర్, జంగిలి మహేష్, బారతపు రాజేందర్, ,తిరుపురం రాంచందర్, తిరుపురం సాయి క్రిష్ణా, గుండీ నాగరాజు, కోలగాని అంజన్న, మల్లీకార్జున్, కొలగాని మహేందర్,గాదే అశోక్, వంగల రమేష్, సిపతి శ్రీనివాస్, ముద్దం ధేవయ్య, తేలు గోపాల్, మాసం రమేష్, తదితరులు మున్నూరు కాపు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.
చైర్ పర్శన్ శ్రీమతి బోగ శ్రావణి ప్రవీణ్ !

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,అప్పుడే మహిళా సాధికారత సాధించిన వారౌతారని పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రావాణి ప్రవీణ్ అన్నారు.
పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మేరు మహిళల కు ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి శుభాపరిణామమని, మహిళ ల కోసం ప్రభుత్వం తరపున మహిళ సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు ఇవ్వడం జరుగుతుందని, వివిధ రకాల యూనిట్ల ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, అందుకోసం తన వంతు సహాయసహకారాలు అందివ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా మేరు మహిళలు వేసిన మూడు ఉత్తమ ముగ్గులకు ప్రధమ బహుమతి గట్ల.జాన్సీరాణీ, ద్వితీయ బహుమతి గట్ల మాధవి ప్రణయ్, తృతీయ బహుమతి రాపర్తి. రాధిక లకు మరియు పాల్గొన్న 40 మంది మేరు మహిళలు, యువతులకు, పిల్లలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో 38వ వార్డు దాసరి లావణ్య ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు మాడిశెట్టి. మల్లేశం, జిల్లా అధ్యక్షుడు గట్ల.రమేష్, పట్టణ ఉపాధ్యాక్షుడు రాగిల్ల. నారాయణ, ప్రధాన కార్యదర్శి రాపర్తి.గణేష్, సహాయ కార్యదర్శి రాపర్తి.రామదేవి ప్రశాంత్, కోశాధికారి మ్యాతరి. మహేష్, జిల్లా కోశాధికారి రామగిరి.శ్రీనివాస్, బహుమతుల ప్రదాతలు మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్, వోదెల.కమల గంగాధర్, మాజీ కోశాధికారి గట్ల.రాధకిషన్, కొక్కు.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు సంక్రాంతి సంబరాలు !

జగిత్యాల జిల్లా పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు భోగి సంబరాలు. జరుపుకున్న ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
