యూనిఫాం లేని సైనికులు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్!

జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ !

J.Surender Kumar,

భారత స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కమిషనర్, జ్యోతి హై స్కూల్ డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు అధ్యక్షతన ఆదివారం జ్యోతి పాఠశాల విద్యార్థులు 50 మంది స్కౌట్స్ 30 మంది గైడ్స్ దీక్ష స్వీకారణ కార్యక్రమం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ సేవకై అనునిత్యం స్కౌట్స్ అండ్ గైడ్స్ సిద్ధంగా ఉండాలని తెలిపారు, DSP చిన్నారులచే దీక్ష స్వీకరణం చేయించి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొందించి వారిని ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేసిందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కన్న ఈ లాంటి ఒక ఉద్యమ స్ఫూర్తి దాయక కార్యక్రమం లో పాలు పంచుకోవడం ఎంతో ఆనందకారం అని అన్నారు.

జగిత్యాల జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ కొలగాని మధుసూదన్ మాట్లాడుతూ. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం లో తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలుపుటకు తగు కృషి చేస్తానని తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్టిక్ అసోసియేషన్ జగిత్యాల సభ్యుల సహకారం మరువలేనిదని కొనియాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రటరీ కంకణాల రామ్ రెడ్డి మాట్లాడుతూ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం 1907 లో ఇంగ్లాండ్ లో బడెన్ పావెల్ ప్రారంభించగా నేడు 200 దేశాల కు విస్తరించిందని , రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకొని నిలబడిన ఏకైక సంస్థ ఈ స్కౌట్ ఉద్యమం మాత్రమే అని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సిద్దార్థ స్కూల్ డైరక్టర్ శ్రీధర్ రావు, అజిత భార్గవి, జాయింట్ సెక్రెటరీ పూజగిరి జమున రాణి ,డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ చంద నాగరాజు, కోశాధికారి నర్శయ్య గారు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కమిషనర్ వినోద్ గారు ,భూమరెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.