24న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక!
రూట్ మ్యాప్ వెల్లడి..
J. Surender Kumar,
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్, తన వారాహి ప్రచార వాహన రథం పూజ కోసం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి, నరసింహ క్షేత్రాల సందర్శన కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ నెల 24న రానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ రూట్ మ్యాప్ షెడ్యూల్ విడుదల చేసింది.

24న హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల, అనంతరం వారాహి వాహనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి తన యాత్రకు శ్రీకారం చుడతారు.

అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి..
వారాహి ప్రచార రథ వాహనం కు నూతన సంవత్సరం జనవరి 2న ( ముక్కోటి పర్వదినం సందర్భంగా) దర్శించుకుని ప్రత్యేక పూజలకు రానున్నట్టు స్థాయిలో ప్రచారం జరిగింది. కారణమేమి తెలియదు కానీ. ఆరోజు కార్యక్రమం వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో.

పోలీస్ వర్గాలు భారీ బందోబస్తుతో పాటు, వాహనాల కాన్వాయ్ లో. ఎన్ని వాహనాల అనుమతించాలి ఆలయంలోకి ఎంతమంది అనుమతించాలి అనే. అనే అంశంపై పోలీసు అధికారులు కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా ఆంధ్రాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అపశృతి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని కట్టడికి పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.