కంటి వెలుగు కార్యక్రమానికి….
J. Surender Kumar,.
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ ధర్మపురి పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లను. మంగళవారం ఆయన పరిశీలించారు. ఈనెల 19న బ్రాహ్మణ సంఘం భవనంలో కంటి వెలుగు -2023 ప్రారంబోత్సవ జరగనున్నది. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ముందస్తుగా భవనాన్ని పరిసరాలను పరిశీలించారు.

వైద్య ఆరోగ్య , మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి సూచనలు ఏర్పాట్ల నిర్వహణ తీరు గూర్చి వివరించారు. మున్సిపల్ కమీషనర్ , మేనేజర్ , సానిటరీ ఇన్స్పెక్టర్, వైద్య సిబ్బంది , మరియు అధికారులు

పరామర్శలు…..

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్ల్లురి లక్ష్మణ్ కుమార్, మంగళవారం అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
సీనియర్ నాయకుడు మనిషి అలకొండ నర్సయ్య, రామయ్యపల్లె, గ్రామానికి చెందిన కలమడుగు దుర్గవ్వ అనారోగ్య సమస్యలతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాంగ్రెస్ నాయకులు,
సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, చిలుముల లక్ష్మన్, షబ్బీర్, రఫియొద్దిన్, సుధాకర్ రెడ్డి , సుద్దాల ప్రశాంత్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.