ఎమ్మెల్యే సిఫారసుతోనే కోసం దరఖాస్తు చేసుకోవాలి!
మంత్రి కొప్పుల ఈశ్వర్!
J. Surender Kumar,
దళిత బంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోను ఆగదని ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. త్వరలోనే విధి విధానలు నిర్ణయం జరుగుతుందన్నారు.
కొందరు కోర్టుకు వెళ్లడంతోనే కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పారు.
హైదరాబాద్ లోమినిస్టర్ క్వార్టర్స్ లో శనివారం అల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. తెలంగాణ దళిత బంధు ఓ మహా యజ్ఞంలా కొనసాగుతున్నదని అందరికి ఒకే సారి దళిత బంధు సాయం అందదని, విడతల వారీగా దళిత బంధు అందుతుందని చెప్పారు. అర్హులు అందరికి దళిత బంధు వస్తుందన్నారు.
దళిత బంధు కోసం బడ్జెట్ లో కోట్లాది రూపాయలు విడుదల చేయటం జరుగుతుందని చెప్పారు. ఏ ప్రాంతం వారు అయినా అక్కడి ఎమ్మెల్యే సహకారంతో దళిత బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా రూపొందించిన పథకం దళితబంధు అని మంత్రి అన్నారు .
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిందని చెప్పారు.
దళిత బందు రాష్ట్రంలో పక్కడబందిగా అమలవుతుందని ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. పార్టీలకు అతీతంగా లబ్ది దారులను గుర్తించి పధకం వర్తింప చేస్తున్నామని చెప్పారు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలోని 119 నియోజవర్గాలలో దళిత బంధు పథకం అమలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
దళితులందరికీ లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
దళిత బంధు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల ఖమ్మం లో నిర్వహించిన బిఆర్ఎస్ .సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారని గుర్తు చేశారు.

ఇప్పటికే దళిత బంధు నుంచి ఆర్థిక సాయం అందుకున్న వారు తమ యూనిట్లు ప్రారంభించుకున్నారని మంత్రి చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా 2021, సెప్టెంబరు 14న ₹10లక్షల చొప్పున 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసిందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39 వెలమంది లబ్ది దారులను గుర్తించడం జరిగిందని, ₹ 3840 కోట్లు విడుదల చేయడం జరిగిందని వివరించారు.
ఈ కార్యక్రమం లో అలిండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సోసైటీ జాతీయ గౌరవ అధ్యక్షులు ముత్తన్న, సెక్రటరీ జనరల్ బాలకృష్ణ, జగన్నాధం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష, కళ్యాణ్, సుబ్బారావు, ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.