ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ !
J. Surender Kumar,
ఎవరి కొంప ముంచాలి ? ఎవరిని నాశనం చేయాలన్నదే కేసీఆర్ కుటుంబం ఆలోచన అని ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.. ఆదివారం .కొండగట్టు అంజన్న ను దర్శించుకొని ఆయన మొక్కులు తీర్చుకున్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఇతరుల నాశనం కోరే వాళ్లు చేసే పూజలు ఫలించమని సంజయ్ అన్నారు. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివ్రుద్ది ఇస్తానన్న నిధులు ఇంతవరకు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయా ఆలయాలను అభివ్రుద్ధి చేయడంతోపాటు భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కష్టాలు తొలిగి పోవాలని అంజన్న స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలను ముంచుతున్నరు. దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నరు. సీఎం కేసీఆర్ నోటికి అడ్డూ అదుపు లేదు. ఎములాడ రాజన్నకు ఏటా రూ,100 కోట్లు చొప్పున 400 కోట్లు ఇస్తానన్నడు. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.100 కోట్లు విడుదల చేస్తానన్నడు. కొండగట్టు అంజన్న ఆలయానికి రేపే రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి 2 నెలలు కావొస్తున్నా పైసా ఇవ్వలేదు. అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం నిత్యం ఎవరి కొంప ముంచాలి? ఎవరిని ముంచాలి ? ఎవరిని నాశనం చేయాలని ,? చూస్తున్నరు వారు క్షుద్ర పూజలు చేస్తున్నరు. ఇతరుల నాశనం కోరేటోడు బాగుపడరనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మంచి కోసం మొక్కితేనే, పూజలు చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు.
కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతితో వేల కోట్లు సంపాదిస్తున్నరు. దొంగ దందాలు చేసి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలను మాత్రం బికారులను చేస్తున్నారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడికి అధికారం ఇవ్వడంతో ప్రజలు బతుకులు నాశనం అయితున్నాయి. అని అన్నారు.

కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరొచ్చినా అవుట్ అవుతోంది. పాకిస్తాన్, శ్రీలంకలో తిండి లేక జనం కొట్టుకొని చస్తున్నారు పాకిస్తాన్ లో గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకుంటున్నరు. చైనా కరోనాతో అల్లాడుతోంది. అని అన్నారు.
కార్యకర్తల పోరాట ఫలితంగా త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం రాబోతోంది. రామ రాజ్యం వచ్చిన తరువాత కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాలను అభివ్రుద్ధి చేస్తాం. భక్తులకు ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు బండి సంజయ్ స్పష్టం చేశారు..