J. SURENDER KUMAR,
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈనెల 18 జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి రానున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా శ్రీ సాంబశివ నాగేశ్వరాలయ స్వామి దర్శనం కోసం రానున్నట్టు , తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుగ్గారం గ్రామ పరిసరాలలోని సాంబుని గుట్ట వద్ద కొలువై ఉన్న సంతానాయుక్త, శ్రీ సాంబశివ నాగేశ్వరాలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం మహాశివరాత్రి జాతర ఉత్సవాలలో భాగాంగా ప్రముఖ కళాకారులు నక్క రాజు బృందంతో నిర్వహిస్తున్న 24గంటల నిర్విరామ గాన స్వరాభిశేకాన్ని కోదండరాం తిలకించనున్నారు.

టీజేఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ రామగిరి సంతోష్, జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు అళ్ళెంకి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్ తదితర నేతలు ప్రొ. కోదండరాం తో రానున్నట్టు గంగారెడ్డి తెలిపారు.