అధికారుల నిర్లక్ష్యమే కొండగట్టు ఆలయ దొంగతనానికి అవకాశమా ?


సీఎం కేసీఆర్ దర్శించుకున్న పది రోజుల్లోనే..


ముందస్తు ‘ ఉప్పు ‘లో

J.Surender Kumar,


ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారం  కొండగట్టు ఆంజనేయస్వామినీ సీఎం కేసీఆర్ దర్శించుకున్న 10 రోజులలోనే  జరిగిన దొంగతనానికి ఆలయ అధికారుల నిర్లక్ష్యమే దొంగలకు అచ్చి వచ్చిన అవకాశం గా మారిందా ? అనే చర్చ నెలకొంది. జనవరి లో.’ఆలయాల్లో భక్తుల భద్రత చర్యలేవి ?’  వార్త కథనం ‘ ఉప్పు’ లో ప్రచురితమైంది.

నిఘా నిద్రపోయిందా ?

కథనం భద్రతపై


కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గత కొంతకాలంగా పోలీస్ అవుట్ పోస్ట్ కొనసాగుతున్నది.. ఏ ఎస్సై నలుగురు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారు. ఇక్కడే భక్తులకు అవసరమైన కొబ్బరికాయలు పూజ సామాగ్రి తదితర వస్తువులు విక్రయించే వ్యాపారులు నివాసం ఉంటారు.. మానసిక వైకల్యం ఉన్న భక్తులు, వారికి రక్షణగా వారి కుటుంబ సభ్యులు కూడా రాత్రులు పడుకుంటారు. దాదాపు కనీసం వంద మంది వరకు  ఉంటారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది.


10 రోజుల క్రితమే సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు!

ఫిబ్రవరి 15 సీఎం కేసీఆర్ దర్శనం ఫైల్ ఫోటో


కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం ₹ 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్. ఈనెల 15 స్వామివారిని దర్శించుకుని కొండగట్టు మాస్టర్ ప్లాన్ ను పరిసరాలను కాలినడకన పర్యటించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం రాక సందర్భంగా భారీ.భద్రతా చర్యలు నేపథ్యంలో 24 గంటల పాటు భక్తులను సైతం అధికారులు అనుమతించలేదు. పోలీసు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రెండు రోజుల ముందు నుంచి భద్రత చర్యలు చేపట్టారు. శుక్రవారం జరిగిన దొంగతనం నేపథ్యంలో 10 రోజుల్లోనే  దొంగలు రిక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారా.? అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నా అనే చర్చ నెలకొంది..


శుక్రవారం కొండపై సిగ్నల్స్ లేవు !

సెల్ఫోన్ సిగ్నల్స్ కోసం గుట్టలు ఎక్కుతున్న పాత్రికేయులు శుక్రవారం నాటి దుస్థితి.


కొండగట్టు ఆలయ. ప్రాంగణంలో శుక్రవారం ఉదయం నుంచి  ఏ నెట్వర్క్ సెల్ ఫోన్ సిగ్నల్స్ భక్తులకు, పాత్రికేయులకు అందుబాటులోకి రాలేదు.. ఆలయంలో జరిగిన దొంగతనం విచారణ నేపథ్యంలో అధికారులు నెట్వర్క్ కు అంతరాయం కలిగించారా ? లేక దొంగతనానికి పాల్పడిన వారే ఈ చర్యలకు పాల్పడ్డారా ? అనే  సమాచారం లేదు.


కానరాని భద్రతా చర్యలు!

జనవరి మొదటి వారంలో జగిత్యాల ధర్మపురి కొండగట్టు కోరుట్లలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు ఫైల్ ఫోటో

కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న ప్రముఖ ఆలయాలు కొండగట్టు, బాసర, ధర్మపురి, వేములవాడ, గూడెం, ఇలాంటి అనేక నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని ప్రవేశ ద్వారాల వద్ద డోర్ మెటల్ డిక్టేటర్లు అగుపించావు, 
తనిఖీలు చేపట్టాల్సిన హ్యాండ్ మెటల్ డిక్టేటర్లు ఉండవు, అత్యధిక శాతం సీసీ కెమెరాలు పనిచేయవు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను,  హ్యాండ్ బ్యాగులను ఎలా తనిఖీలు చేస్తారో?  అనుమానాస్పద వ్యక్తులను ఎలా గుర్తిస్తారో ?  కొలువైన ఉన్న ఆ దేవుడికే తెలియాలి!   ఆలయ  ప్రాంగణాల్లో, జన సమర్థం గల ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికను పర్యవేక్షిస్తూ ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి. పోలీస్ శాఖ ద్వారా శిక్షణ పొందిన ఇద్దరు నిష్ణాతులైన సెక్యూరిటీ గార్డులను ఆయా ఆలయాలలో ఉండాలి. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు, మెటల్ డిటెక్టర్ ద్వారా ప్రవేశాలు,. హ్యాండ్ మెటల్ డిక్టేటర్ తనిఖీ దృశ్యాలను ఆలయ అధికారులు భద్రపరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్వామివారి వెండి ఆభరణాలు ఉన్నాయో పోయాయో


జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలో ఐఎస్ఐ తీవ్రవాది, హజంఘోరి ఎన్కౌంటర్ తర్వాత, నిఘా వర్గాల సూచనల మేరకు దేవదాయ శాఖ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు 2007, సెప్టెంబర్ 12న, లేక సంఖ్య  జే 2/968/06 ద్వారా భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా  ద్వారాల వద్ద మెటల్ డిక్టేటర్ లు, హ్యాండ్ డిక్టేటర్ లు, అదనంగా, ప్రత్యేకంగా, సీ. సీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
అనేక ఆలయాల్లో సెల్ ఫోన్లు భద్రపరిచే లాకర్లు గాని ఉద్యోగి గాని లేకపోవడం విశేషం.

రాపిడ్ యాక్షన్ ఆక్టోపస్ బలగాలు ఎందుకు వచ్చాయి ?

జనవరి మాసంలో ఆక్టోపస్ బలగాల మాకు కొండగట్టు ఆలయంలో


జనవరి మాసంలో రాపిడ్ యాక్షన్ ఫోర్ బలగాలు కొండగట్టు ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలు తో పాటు కోరుట్ల, జగిత్యాల. ధర్మపురి మల్యాల పట్టణాలలో నిర్వహించడంతోపాటు ఆలయాల పరిసరాలను పరిశీలించారు.  జనవరి మూడో వారంలో ఏకంగా ఆక్టోపస్ బలగాలు 120 మంది ఇందులో 60 మంది స్థానిక పోలీసులు కొండగట్టు ఆలయంలో మాకు డ్రిల్ నిర్వహించారు. ఆలయంలోకి తీవ్రవాదులుచొరబడి భక్తులను కిడ్నాప్ చేసినట్టు వారిని రక్షించినట్లు. నిర్వహించిన మాక్ డ్రిల్  భక్తులలో ధైర్యాన్ని నింపింది. విధి నిర్వహణలో భాగంగా వారు కొండగట్టు ఆలయంలో మాక్ డ్రిల్ చేశారా ?  కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ట్రయల్ రన్ చేశారా ?  అనే అంశం కొండగట్టులో  దొంగతనంతో చర్చనీయాంశంగా మారింది.