ఆలయ అధికారుల ఇష్టారాజ్యం !పాలకవర్గాన్ని పట్టించుకోని వైనం!

విచారణ చేశారు చర్యలు మరిచారు!

J. SURENDER KUMAR,

ప్రముఖ ఆలయాలలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ పాలకవర్గం సలహాలను, సూచనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  అధికారుల. అక్రమాలపై పాలకవర్గ సభ్యుల ఫిర్యాదులు చేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతారు తప్ప, అక్రమాలు వెలుగు చూసినా బాధ్యుల పై చర్యలు చేపట్టడానికి జంకుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

వివరాలలోకి వెళితే..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వంశపారంపర్య చైర్మన్ తో పాటు. మరో 13 మంది పాలకవర్గ సభ్యులను. ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి 12న నియమించింది. వారి పదవి కాలం ఆదివారం  ముగిసింది. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై కొందరు పాలకవర్గ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు అనేక సందర్భాల్లో మౌఖికంగా వివరించినట్టు సమాచారం.  వీరితోపాటు స్వయానా వంశపార్యం. పాలకవర్గ చైర్మన్  కమిషనర్ కు గత సంవత్సరం నవంబర్ లో ఫిర్యాదు చేశారు.


పాలకవర్గ చైర్మన్ ఫిర్యాదు తో                           
విచారణ !

కొండగట్టు ఆలయంలో గత సంవత్సరం నవంబర్ 23న హైదరాబాద్ దేవదాయశాఖ కు చెందిన అధికారిని ఏడిసి జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్,  కొండగట్టు ఆలయంలో విచారణ జరిపారు.  కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు, సమయపాలన పాటించడం లేదని, నిధుల 30% పరిధి అతిక్రమించిందని, అనవసర ఖర్చులతో ఆలయానికి ఆదాయంకు గండి పడుతుందని తదితర అంశాలపై హైదరాబాదులో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టారు. విచారణలో వాటర్ బాటిల్ కొనుగోలు, హుండీ లెక్కింపులో స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు చెల్లించినట్టు నమోదు చేయడం. నవంబర్ మాసం నాటికి బడ్జెట్ శాంక్షన్ అనుమతులు లేకుండానే  నిధులు ఖర్చు చేయడం లాంటి అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విచారణలో గుర్తించినట్టు సమాచారం. విచారణ చేపట్టి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టిన సందర్భం లేదని, భక్తజనంతో పాటు కొందరు పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టగలిగితే అనేక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.