అమెరికా గడ్డ పై గుడి కట్టిన..
తెలుగు బిడ్డా….

వన్ మ్యాన్ ఆర్మీ ..అతడు!

J. Surender Kumar,

స్వదేశంలో సామాన్యుడు  ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టాలి అంటే,  ప్లానింగ్, పర్మిషన్ లు పని మనుషులు, పరికరాలు, పలు అంశాలతో పాటు ఆర్థిక అంశం ప్రధానం అనే విషయం తెలిసిందే.  ఈ దశలో ప్రపంచ అగ్రరాజ్యం, అమెరికా గడ్డ పై సనాతన హిందూ ఆచార సాంప్రదాయాలు అంతరించిపోకుండా, అక్కడి హిందూ కుటుంబ సభ్యుల  సహకారంతో ఓ తెలుగు బిడ్డ గుడి కట్టాడు. ఆ గుడి ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అంతరించకుండా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వేద పండితుడు కసజ్జుల చంద్రశేఖర్ శర్మ, అభినందనీయుడు. వన్ మ్యాన్ ఆర్మీ అతడు అని చెప్పక తప్పదు,

డబ్లింగ్ లో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందిన  చంద్రశేఖర్ శర్మ, సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు. 2001లో అర్చకుడిగా (పూజారిగా) అమెరికా దేశానికి వెళ్లారు. వేద శాస్త్ర, వాస్తు రంగాల్లో, అపార అనుభవం ఉన్న శర్మ కాలిఫోర్నియా రాష్ట్రం శాని ఫ్యాన్స్ కు పట్టణం డబ్లిన్ లో 2018 లో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి. ధర్మపురి ఆలయ వేద పండితుడు బొజ్జ రమేష్ శర్మ, ఇతర పండితులు భావి నరహరి శర్మ, సంగనభట్ల సునీల్ శర్మ, మంథని, గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్, నిజామాబాద్ నుంచి వేద పండితులు  ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నరు.

ప్రతిష్టించడానికి సిద్ధంగా ఉన్న విగ్రహాలు(ఫైల్ ఫొటోస్)

. పార్వతీ పరమేశ్వరుడు, సీతారామస్వామి, లక్ష్మీ గణపతి 12 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి, అమ్మవారు అయ్యప్ప స్వామి, అనంతపద్మనాభ స్వామి, విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం జరిగింది. 

ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి ఆలయ వేద పండితుడు రమేష్ శర్మ (ఫైల్ ఫోటో)

త్వరలో 36 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ట!

భక్తుల, కమిటీ సభ్యుల సలహాలు సూచనల మేరకు 36 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు కార్యాచరణ మొదలైనట్టు శర్మ వివరించారు. కర్ణాటక రాష్ట్రం లో స్వామి వారి విగ్రహ తయారీ కి రాయి లభ్యమైనది. వాటికి సాంకేతిక, రసాయన పరీక్షలు నిర్వహించి రాయి యోగ్యమైనదిగా నిర్ధారణ జరిగితే, 2026 లో స్వామి వారి విగ్రహాన్ని అమెరికాకు పంపిస్తామని వారు వివరించినట్టు తెలిపారు. విగ్రహ తయారీకి ప్రస్తుతం ₹ 8 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లించారు.

ఆ విగ్రహమే మూలం!.

అమెరికాలోశాండీయ  రాష్ట్రానికి చెందిన భక్తుడు వేణు కుమార్ దొరపల్లి, తన తమ్ముడి వివాహం 2017 లో హైదరాబాదులో జరిగిందని ఆ వివాహానికి తనను ఆహ్వానించారని బేగంబజార్ లో కొనుగోలు చేసిన శ్రీ సీతారామ స్వామి , పార్వతి పరమేశ్వడి విగ్రహాలకు మొదటగా పూజలు, కళ్యాణం చేసి విగ్రహాలు తనకు అప్పగించి అమెరికాకు వారే ఖర్చులు భరించి పంపించారన్నారు.  అక్కడ హిందూ కుటుంబాలు ఈ విగ్రహాలకు కళ్యాణం, పూజలు జరిపించడం కొనసాగిందని వివరించారు. ఓ శిష్యుడు అపార్ట్మెంట్ వాస్తు నిమిత్తం తనను ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడని శర్మ తెలిపారు. అక్కడ తన వద్ద గల విగ్రహాల పూజ , వేద పాఠశాల నిర్వహణ కోసం ఓ గదిని అద్దెకు అడిగాను అన్నారు.

పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హిందూ భక్తజనం(ఫైర్ ఫోటో)

దాదాపు 20 ఎకరాల స్థలంలో.. కూచిభట్ల సుబ్రహ్మణ్య శర్మ, మధు బెంగళూరు , తదితరులు ఆలయ నిర్మాణానికి నడుం బిగించామన్నారు. PMHT.Arc (పంచముఖ హనుమాన్ డాట్ ఆర్క్) వెబ్సైట్లో వివరాలు పోస్ట్ చేస్తే వారు ఆరు గ్రూపులకు, వారు 25 గ్రూపులకు పోస్ట్ చేయడంతో ప్రస్తుతం 270 మంది వరకు హనుమాన్ వానర సేన సభ్యులు, దాదాపు 1600 మంది భక్తులు ఉన్నట్టు వివరించారు.
వేములవాడ  తరహాలో ఆలయ క్షేత్ర నిర్మాణంకు ప్రణాళికలు ఉన్నాయని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే. ఆలయానికి 30 మంది వేద పండితులు, నాదస్వర బృందం సభ్యులు నలుగురు, ఐదుగురు వంట వాళ్లు, స్వామివారికి పుష్కరిణి, 2000 మంది భక్తులు కూర్చుండి స్వామి వారల కళ్యాణ ఉత్సవాలు తిలకించడానికి, కల్యాణాలు జరుపుకోవడానికి కళ్యాణమండప నిర్మాణం, వేద పాఠశాల తదితర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు శర్మ స్పష్టం చేశారు. ఇటీవల జగద్గురులు శృంగేరి పీఠాన్ని దర్శించుకుని ఆలయ నిర్మాణ కార్యక్రమాలు వివరిస్తూ. స్వామి అనుగ్రహం, ఆశీస్సులు పొందినట్టు తెలిపారు.

వేద శాస్త్ర కుటుంబం..

ధర్మపురిలో కసిద్దుల వారి గుడి!

సనాతన ఆచార, సాంప్రదాయాలు పాటిస్తూ వేద శాస్త్రాలను అవపాసనం పట్టిన కుటుంబానికి చెందిన కసజ్జుల శివరాం శర్మ మంజుల దంపతులకు, నలుగురు సంతానంలో రెండవవాడు శర్మ, శివరాం శర్మ, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ గా పదవి విరమణ చేశారు.  ఆయన  వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, తదితర ప్రముఖ పుణ్యక్షేత్రా  ఆలయాల కార్య నిర్వహణ అధికారిగా పనిచేశారు. ఆలయాల చరిత్ర విశేషాలు, పూజాది కార్యక్రమాలు, చిన్నతనంలో నే చంద్రశేఖర్ శర్మ పై ప్రభావం కాబోలు, తాత రాజన్న శాస్త్రి, సంవత్సరాల తరబడి తన ఇంటిలోనే నిత్యం (365 రోజులు) పురాణ ప్రవచనాల ప్రభావమో, వందలాది సంవత్సరాలుగా ధర్మపురి క్షేత్రంలో వారి వంశస్థులు  శివ పంచాయతనం గుడి ( కసజ్జుల వారి గద్దె ) పై పూజలు, అభిషేకాలు, నిత్య నైవేద్యాలు, నేటికీ  కొనసాగిస్తుంటారు, (వారు స్థానికంగా ఉన్నా లేకున్నా) వారి కొనసాగిస్తుంటారు. ఏ ప్రభావమో తెలియదు కానీ, అమెరికా దేశంలో ఆలయ నిర్మాణానికి వన్ మ్యాన్ ఆర్మీగా చంద్రశేఖర్ శర్మ  చేస్తున్న కృషి అభినందనీయమే.

అమెరికా అధ్యక్షునితో పాత పరిచయమే!

2003లో మహాలక్ష్మి ఆలయం లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న నేటి అమెరికా అధ్యక్షుడు నాటి సెనేటర్ కు బొట్టు పెడుతున్న శర్మ (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జోబైడన్ తో చంద్రశేఖర్ శర్మకు 2001 సంవత్సరం నుంచి ముఖ పరిచయం ఉంది.  వీసా సమస్య తలెత్త గా డెలివన్ స్టేట్ సేనేటర్  గా ఉన్న జో బైడన్, థామస్ కార్బర్, శర్మకు సహకరించారు. 2003 మే మాసంలో మిల్టన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం లో జరిగిన కుంభమేళా మహోత్సవ కార్యక్రమానికి  జో బైడేన్  పాల్గొన్నారు.  3000 హిందూ కుటుంబాలు నివాసం ఉంటున్న పట్టణంలో భారతీయ సాంప్రదాయాలు ఆచార అంశాల పట్ల ఆయన తన సంపూర్ణ సహకారాలు అందించి ప్రోత్సహించారని తన నుదుట తిలకం దిద్దించుకున్నారని చంద్రశేఖర్ శర్మ తెలిపారు. హిందూ సాంప్రదాయాలు గౌరవించి ఆదరించడంలో జో బైడేన్ అభినందనీయుడని శర్మ ఈ సందర్భంగా అన్నారు.