₹ 9 లక్షల విలువ ఆభరణాలు చోరీ!
గాలింపు చేపట్టిన 10 పొలీస్ బృందాలు .
జగిత్యాల్ డిఎస్పి ప్రకాష్!
J. Surender Kumar,
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దొంగతనంలో దాదాపు తొమ్మిది లక్షలు విలువైన స్వామివారి ఆభరణాలు దొంగతనం జరిగి ఉండవచ్చని జగిత్యాల డిఎస్పి రత్నాపురం ప్రకాష్ పాత్రికేయులకు వివరించారు. దొంగలు భక్తుల వేషాలు వచ్చినట్టు సిసి ఫుటేజ్ ల ద్వారా అనుమానిస్తున్నామని, సి సి ఫుటేజ్ లలో ముగ్గురే అగుపిస్తున్నారని, డి.ఎస్.పి స్పష్టం చేశారు. పొలాస లోని ఆలయ ఈవో బీరువాను, రాయపట్నం వద్ద గుడిలో దొంగతనం జరిగినట్టు సమాచారం వచ్చిందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమండపంలో ఆంజనేయ స్వామి వారి వెండి మకర తోరణం ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు పడ్డట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు., డాగ్ స్క్వాడ్‌తో ఆలయ పరిసర ప్రాంతంలో సోదాలు చేపట్టామని కోస్టింగ్ ఐటీ టీం సైబర్ క్రైమ్ సాంకేతిక నేర పరిజ్ఞానంతో దొంగలను త్వరలోనే పట్టుకుంటామని డి.ఎస్.పి అన్నారు.
