ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ !
జె.సురేందర్ కుమార్,
జగిత్యాల జిల్లా కేంద్రంలో గిరిజన లాంబడి సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సంతు సేవలాల్ 284వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , జెడ్పీ ఛైర్మన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మహాబోగ్ కార్యక్రమంలో పాల్గొని అగ్ని దేవతలకు పూజలు నిర్వహించారు, అనంతరం సేవాలాల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నమస్కరించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :
తెలంగాణ రాష్ట్రంలోని బంజరాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నరని,_
తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని చిన్న చిన్న తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నెరవేర్చి,గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేయడం జరిగిందని చెప్పారు._
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజారా / లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు._
గిరిజన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు సిఎం.కేసీఅర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని,. 10% రిజర్వేషన్ పెంచి గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచారని అన్నారు._
సంత్ సేవలాల్ మహరాజ్ ఆశయాలను అనుగుణం గా బంజారాలు నడుచు కోవాలన్నారు.

సేవాలాల్ ఏ స్ఫూర్తి నిచ్చారో..ఆ స్పూర్తి తోనే సేవ పనులు చేయాలని సూచించారు,
జిల్లా గిరిజనులకు అండగా తాము ఎల్లవేళల ఉంటామని, ఏ కష్టమెచ్చిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు._
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, ఎంపీపీ లావుడ్య సంధ్య సురేందర్ నాయక్,సర్పంచ్లు,ఎంపీటీసీలు,జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు,ఎంపిడిఓ సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు,గిరిజన లంబాడీ సోదరులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మీరు నేను .. లో ఎమ్మెల్యే సంజయ్!

సారంగాపూర్ మండల కోనా పూర్, పొచం పెట్, పెంబట్ల గ్రామాలలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అయా గ్రామలలో వార్డులలో పర్యటించి, .ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ,పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు, నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బీసీల ఆత్మగౌరవ యాత్రను విజయవంతం చేయాలి!

త్వరలో చేపట్టబోయే జగిత్యాల జిల్లా
బీసీల ఆత్మగౌరవ యాత్రను విజయవంతం చేయాలని బిసి సంఘ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టి పెల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘము మండల అధ్యక్షుడు బాస నాగేందర్ మరియు ఉపాధ్యక్షుడు పాలగాని మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బి.సి ముఖ్యనాయకుల సమావేశము జరిగినది.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో బి.సి. లకు రిజర్వేషన్లు కల్పించాలి మరియు చట్టసభల్లో బి.సి లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 78 కోట్లకు పైగా అత్యధిక జనాభా కలిగిన అందులో 74% కలిగిన బి.సి లకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి, నెట్టి వేయబడ్డారు. చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్లు లేకపోవడం వలన బి.సి లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య, బి.సి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీపతి రమేష్, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, బి.సి. సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దీటి వెంకటేష్, మండల ఉపాధ్యక్షుడు పలగాని మల్లేశ్ యాదవ్, బి.సి. సంక్షేమ సంఘం సారంగాపూర్ మండల అధ్యక్షుడు బాస నాగేందర్, బి.సి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కు ఉదయ్ కుమార్, మరియు బి.సిమండల కార్యదర్శిలు వినోద్ కుమార్ గొల్లపెల్లి మహేందర్ ఎదులాపురం గంగాధర్ కార్యవర్గ సభ్యులు ఆకుల మల్లేష్ దాసరి ప్రదీప్ నాగునుర్ బట్టపల్లి గ్రామ అధ్యక్షులు జెట్టి రమేష్ ఉపాధ్యక్షులు మారం చిరంజీవి ప్రధాన కార్యదర్శి మారం శ్రీనివాస్ కార్యదర్శి ఓజ్జెల సురేష్, రాయికల్ మండల అధ్యక్షులు బండారి సాయిరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సామల్ల సతీష్,మరియు బట్టపల్లి బి. సి నాయకులు పాల్గొన్నారు నాయకులు తదితరులు పాల్గొన్నారు.