బీఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ @70 వసంతంలోకి !

నేడు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పుట్టినరోజు!

@49 లో టిఆర్ఎస్ నేతగా @70. బీఆర్ఎస్ నేతగా

J. Surender Kumar,

సీఎం కేసీఆర్ ఒక చరిత్ర, ఓ ప్రభంజనం, అపర రాజకీయ చాణిక్యుడు, పట్టిన పట్టు వీడని యోధుడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించగల సమర్థుడు, ఇలాంటివి అనేక పదాలు సీఎం కేసీఆర్ గురించి ప్రచురితమవుతున్న, ప్రచురించే కథనాల్లో అగుపించే వాక్యాలు, ఫిబ్రవరి 17, 2023 శుక్రవారం నాటి ఆయన 70 వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ వయసులో ఆయన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజకీయ చరిత్ర పుటలలో నమోదయింది. 49 వసంతంలో కెసిఆర్ సాహసోపేతంగా 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సాధించారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
సీఎం కేసీఆర్ పుట్టిన సమయం, గ్రహ కూటములు, గూర్చి ధర్మపురి కి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ విశ్లేషణ ఇలా ఉంది

బి ఆర్ ఎస్ నేతగా


కెసిఆర్ జాతక కుండలి!!
కెసిఆర్ 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరం ఆశ్లేష జన్మనక్షత్రంలో, కర్కట రాశి ,మేష లగ్నంలో జన్మించారు. ధన స్థానంలో గురువు, మూడింట కేతువు, నాలుగవ స్థానంలో చంద్రుడు, ఏడవ స్థానంలో శని, 8వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రాహు ,11వ స్థానంలో సూర్య, శుక్ర బుధ, గ్రహాలు ఉన్నాయి. కెసిఆర్ బుధ మహాదశ లో జన్మించారు. 2014 ఫిబ్రవరి మాసం నాటి కి ఆయన రాహు మహాదశ లో కొనసాగుతున్నారు. కెసిఆర్ జాతకం లో ప్రధాన బలం ఆయన మాట ఆయన జాతక చక్రం లో రెండవ, స్థానం మాట ను సూచిస్తుంది. రెండవ ,స్థానంలో గురువు ఉండటం భాగ్యాధిపతి గురు వాక్ స్థానంలో ఉండటం వల్ల వాక్కు ద్వారా భాగ్యం కలిసి రావటాన్ని సూచిస్తుందని విశ్లేషణ . వాక్కు స్థానంలో గురువు కారణంగా మాట్లాడిన ప్రతి మాట సాధికారికంగా, సవివరంగా అందరికీ అర్థమయ్యేలా ఉండటమే గాక ఎదుటివారు మంత్రముగ్ధులవుతారు.

2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఆహ్వాన పత్రిక


వాక్కు కారకుడు బుధుడు!!
లాభ స్థానం లో ఉన్న నీచరాశి కి దగ్గరగా ఉండడం మేష లగ్నానికి కానీ కర్కట రాశి కి గాని బుద్ధుడు అనుకూలురు కాక పోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసీఆర్ సమస్యలు ఎదుర్కొంటారు అయితే గురుస్థానం బలంగా ఉండటం వలన ఆ సమస్య పెద్దగా ఇబ్బందికి గురి చేయవు అలాగే బుధుడు మీడియాకు కూడా కారకుడు అవ్వటం తొ మీడియా నుంచి సరైన సహకారం ఉండదు శని ఉచ్ఛ స్థితిలో ఉండి స్థానబలం తో ఉండటంవల్ల శుక్ర, శని మధ్య పరివర్తన యోగం ఉండటం వల్ల కేసీఆర్ కు మరో బలం జనాకర్షణ.

కెసిఆర్ జాతకకుండాలి


కుజ దశ ప్రధాన మలుపు!!
విపరీతమైన. రాజయోగం ఇస్తున్న కుజ దశ నుంచి కెసిఆర్ జీవితం ప్రధాన మలుపు తిరిగిన ప్పటికీ 2006లో ప్రారంభమైన రాహుదశ ఆయనకు కలిసి వచ్చింది. రావు భాగ్య స్థానంలో ఉండి గురువు ఇచ్చే ఫలితాలు ఇవ్వటం వలన కేసీఆర్ జాతకంలో 2014 సంవత్సరం జోరుగా ఉందని పండితుడు విశ్లేషణ 2009 మే మాసం నుంచి కేసీఆర్ రాహు మహాదశ లో గురు భుక్తి ప్రారంభమైంది. 2009 నవంబర్ డిసెంబర్ మాసంలో కేసీఆర్ గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగడం గమనార్హం.

జాతకంలో దశలు

2011 అక్టోబర్ మాసం నుంచి రాహు శని భక్తి రాష్ట్ర సాధన చివరి ఘట్టం ఈ సమయంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

జ్యోతిష్య పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ


శని అంతర్దశ 2014 ఆగస్టు వరకు ఉంటుంది. ఈ దశ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు అతి ముఖ్యమైన మరియు అత్యంత అనుకూలమైన దశ ఈ దశలో సొంత రాష్ట్రం రావడంతో పాటు కెసిఆర్ కీర్తి కలకాలం నిలిచే దశ ఇది అని ఆయన విశ్లేషణ
.