చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ భవన నిర్మాణానికి
₹ 5 లక్షలు

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం భవన నిర్మాణం కోసం  ఎమ్మెల్యే నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ సంఘ నాయకులకు అందజేశారు.   ఈ సందర్భంగా MLA డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణం చేసుకోమని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.,

ఈ కార్యక్రమంలో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జగిత్యాల జిల్లా  అధ్యక్షులు శ్రీ కూర్మాచలం రఘునందన్, శ్రీపెరంబుదూరు కృష్ణస్వామి, శ్రీ పెరంబదూర్ విద్యాసాగర్, గోవిందుల కృష్ణ స్వామి, తూఫ్రాన్ వినోద్, నాగరాజు రవీందర్, కల్వకోట మురళి స్వామి తదితరులు  పాల్గొన్నారు.

పరామర్శ

బీర్పూర్ మండలం కోల్వాయి గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్, పానుగంటి స్వప్న మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
KDCCB జిల్లా మెంబర్ ముప్పాల రామ్ చందర్ రావు, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కోలుముల రమణ, తదితర నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.