J.Surender Kumar,
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కోరుట్ల నియోజకవర్గం లోని ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని దాంతోపాటు నిజాం చెక్కర కర్మాగారాలన్నింటిని తెరుస్తామంటూ హామీ ఇచ్చిన కెసిఆర్. ఎప్పుడు తెరుస్తారో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు జువాడి కృష్ణారావు సీఎం కేసీఆర్ ను ప్రకటంలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోని నడిపిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీ ని మరిచిపోయిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని అక్కడి స్థానిక కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితంగా నేడు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని కానీ, గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి , వేములవాడ దేవస్థానం లకు 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని వాగ్దానం చేశారని కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ధర్మపురి క్షేత్రంలో నేటి వరకు ఒక్క పని కూడా చేపట్టలేదని ఆరోపించారు.
గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణికులు మరణించారని ముఖ్యమంత్రి వారి కుటుంబాలను ఈరోజు వరకు పరామర్శించలేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినిమా హీరోలు మరణిస్తే హుటా హుటినవెళ్లి వారి కుటుంబాలను పరామర్శిస్తాడని , ఎక్కడో ఇస్తాంబుల్ లో మరణించిన ఆఖరి నిజామ్ వారసుడు ముకరంజ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను ఓదార్చుతాడని కృష్ణారావు ఆరోపణ లు చేశారు.