J. SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ ప్రాథమిక పాఠశాల లో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన చిట్టి ప్రయోగాలు ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ, సోలార్ విద్యుత్ న్యూట్రిషన్ ఫుడ్ ,తదితర ప్రాజెక్టులు సందర్శకులను అలరించాయి.

ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడం కోసం ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కా శెట్టి రమేష్ ,కే .శారద, కే శ్రీనివాస్ , ధావన్ పల్లి రమేష్ ,రజిత మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

దొంతపూర్ లో..

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్‌లు ఎంతో దోహదపడతాయని దొంతాపూర్ పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు ఆర్ అంజయ్య అన్నారు. మంగళవారం దొంతాపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నేషనల్ సైన్స్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌ను ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ కొండపల్లి రామచందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడి రాణిస్తుండటం సంతోషంగా ఉందని అన్నారు. మండలం లోనే అత్యధిక విద్యార్థులు ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో దొంతపూర్ మొదటి స్థానంలో ఉండడం మంచి పరిణామం అన్నారు. అదే విధంగా సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొన్న విద్యార్థులు మొక్కుబడిగా కాకుండా ఆలోచింపజేసేలా నమూనాలను ఏర్పాటు చేశారని అభినందించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భట్టురి రాజేషం మాట్లాడుతూ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్నారని 50 కిపైగా నమూనాలను విద్యార్థులు స్వయంగా చేసి ప్రదర్శించారు. ఇందులో సమతుల ఆహార బ్యాంక్,జల చక్రం, గ్రహాల నమూనా, పర్యావరణ పరిరక్షణ, రహదారి నియమాలను కోసం చేసిన నమూనా లు ఆహూతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఉప సర్పంచ్ చిగిరి మల్లయ్య, ఉపాధ్యాయ బృందం గజేల్లి సునీత, బండారి సతీష్, చుంచుకాల సింధుజ పాల్గొన్నారు.