₹ 21 కోట్ల రికవరీ మరిచారు ! సీఎం కెసిఆర్ కొండగట్టుకు 100 కోట్లు ఇచ్చారు!

ఆడిట్ అభ్యంతరాల పద్దులే అవి !


సీఎం రాకతో అంజన్న ఆదాయం రికవరీ అయ్యేనా?

J. Surender Kumar,

సీఎం కేసీఆర్ యాదాద్రి, వేములవాడ , ధర్మపురి ఆలయాలను   వేల కోట్ల నిధులతో అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్ర కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు నిధులు కేటాయిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రత్యేక జీవో జారీ చేశారు.  కొండగట్టు ఆలయ ఆదాయం, ఖర్చుల లెక్కలలో దాదాపు ₹21 కోట్ల రూపాయల ఖర్చు వివరాలలో లెక్కలు సక్రమంగా లేవంటూ  రికవరీకి  ఆడిట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ రికార్డులలో నమోదు చేశారు.  సంవత్సరాల కాలంగా  కోట్లాది రూపాయల ఆ పద్దులను అధికారులు రికవరీ చేయడం లేదు.   సీఎం కొండగట్టుకు రాక సందర్భంలోనైనా అధికారులు కోట్లాది రూపాయలు   రికవరీ చేసి  ఆలయ ఖాతాలో  జమ చేస్తారో ?  లేదో ? అనే చర్చ భక్తజనంలో నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే
ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి.ఆలయానికి సాలిన కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది.  ఆదాయంను, ఆలయ అధికారుల, అర్చకులు, సిబ్బంది, జీతభత్యాలు, భక్తుల సౌకర్యాల కల్పన, నిర్వహణ  తదితర వాటికోసం ఆలయ  కార్యనిర్వహణాధికారి  పర్యవేక్షణలో, ఖర్చు చేస్తారు.  
ఆలయ అధికారుల పర్యవేక్షణలో జరిగే కోట్లాది రూపాయల నిధుల,  ఖర్చులకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల పద్ధులకు, సంబంధించిన లెక్కలకు, ఆమోదయోగ్యమైన, పత్రాలు లేనట్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆడిట్ అధికారులు రికార్డులలో నమోదు చేశారు.

ఆడిట్ అభ్యంతర డబ్బుల మొత్తం!
₹ 21 కోట్లు 80 లక్షల, 76 వేల 137/-
2007- 08 నుంచి 2020 -2021 నాటి వరకు!

ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రికార్డులో నమోదు !

వివరాలు !
తెలంగాణ రాష్ట్రంలోనూ.

2015-16 లో  ₹ 4,69,46,387/-  2016-17 లో                ₹ 37,39,041/- .2017-18 లో  ₹ 46,83,975/-   లో 2018-19 లో  ₹ 59,18,469/- 2019-20 లో.  ₹ 6,49,65, 118/-. 2020-21 లో  ₹ 15,35,173/-  దాదాపు ₹ 12 కోట్ల, 77 లక్షలు, 88 వేల 163/-  నిధులు ఖర్చుకు ఆమోదయో యోగ్యమైన పత్రాల వివరాలు  లేనట్టు రికార్డులలో నమోదు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో.
2007-08లో ₹ 6,55,193/- 2008-09 లో   ₹ 70,29,231/- 2010-11 లో  ₹ 1,83, 92,911/- 2011-12  లో  ₹ 4,11,27,680/-     2012 – 13  లో  ₹ 32, 84, 0 3 2 /- 2013-14  లో  ₹ 53,96,384/- 2014-15 లో ₹ 1, 44, 02, 543/- దాదా దాదాపు ₹, 9 కోట్ల 28 లక్షల 3 వేల 674/-. నిధుల. ఖర్చు కు ఆమోదయోగ్యమైన పత్రాలు లేనట్టు అధికారులు రికార్డులలో నమోదు చేశారు

ఆలయానికి  చెందాల్సిన  ₹  5, 078,8,952/- వేలం పాట దారుల వద్దనే !
2019 మార్చి మాసం నుంచి, 2021 మార్చి మాసం !

కొండగట్టు అంజన్న స్వామి ఖాతాలో జమ కావలసిన  ఆదాయ సొమ్ము  ₹. 5, 078, 8,952/-   ఖాతాలో నమోదు కానట్టు సమాచారం. ఆలయ అధికారుల  నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి తో, కోట్లాది రూపాయల వేలం పాట దారిలో వద్దనే ఉన్నట్లు సమాచారం.
దుకాణం వేలం పాట దారుడు ఎంత చెల్లించాలో

వివరాలు ఇలా ఉన్నాయి !
కొబ్బరికాయల అమ్మకం దారు  ₹ 1,60,000/- .ఫోటో స్టూడియో  ₹  8, 23, 449/-  కొబ్బరి ముక్కల సేకరణ  ₹.11, 00000/-  కూల్ డ్రింక్స్ ₹  20,000/-. గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు, ₹  22,75,000/-  చెప్పుల భద్రపరుచు. ₹ 40,00000/-  పువ్వులు పండ్లు అమ్మకం ₹ 20, 80 500/- పుట్నాలు మరియు పేలాలు ₹ 5,00000/-  పాదరక్షలు భద్రపరుచు ₹  85,000/- కిరాణా దుకాణం ₹.1,50,000/- హోటల్ నిర్వహణ. ₹ 11,55,000/- వంట చెరుకు అమ్మకం. ₹ 1,50,000/-  టెంట్ హౌస్ ₹ 84,916/- తలనీలాలు ₹ 12, 23,000/-  కొబ్బరి ముక్కలు ₹ 70,000/-. తలనీలాలు ₹  2,92,50,000/- ఫోటో స్టూడియో ₹ 18,79, 272/-  స్నానపు గదులు & మరుగుదొడ్లు ₹ 24, 42, 815/-  హోటల్ నిర్వహణ ₹ 3,85,000/- కొబ్బరి ముక్కల ₹ 5, 60,5000/- ఫోటో స్టూడియో ₹ 9,50,000/- బకాయిలు ఉన్నట్టు రికార్డులో  నమోదు అయినట్టు సమాచారం.
ఆడిట్ లో వెలుగు చూసిన అభ్యంతరకర కొట్లాది రూపాయల పద్దులను . ప్రభుత్వం రికవరీ చేసి  ఆలయ ఖాతాలు జమ అయితేనే  సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి కొండగట్టు క్షేత్రానికి విడుదల చేసిన ₹ 100 కోట్ల రూపాయలు వినియోగంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు అనే చర్చ భక్తులలో నెలకొంది.


సీఎం కేసీఆర్ రాక సందర్భంలో అయినా కొండగట్టు అంజన్న సొమ్ము రికవరీ ఆయి ఆయనకు చెందుతుందో.,?  లేదో..?  వేచి చూడాల్సిందే.