డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ పూజలు!

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో..

J.Surender Kumar,

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు A. లక్ష్మణ్ కుమార్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం ధర్మపురి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయ అర్చకులు అధికారులు లక్ష్మణ్ కుమార్ కు స్వామి వారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని బహుకరించి, వేద పండితులతో ఆశీర్వదించారు.

నాయకులు సంగనభట్ల దినేష్ , శివరాజు ప్రసాద్ , వేముల రాజు, గణేష్ , కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


ధర్మపురిలో ఆదివారం బైక్ ర్యాలీ !


చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలో ఆదివారం సాయంత్రం. బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు. బిజెపి నాయకుడు గాజు భాస్కర్ ప్రకటన లో పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ పాల్గొని మన హిందూ ఐక్యతను చాకలి అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.. బైక్ ర్యాలీ శివాజీ విగ్రహం నుండి మొదలవుతుందని పేర్కొన్నారు.