ధర్మపురి అరవింద్ పార్లమెంటు సభ్యుడే కానీ..

ఆయన వ్యవహారం భాష మాత్రం అన్ పార్లమెంటరీ!

జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్..

J. Surender Kumar,

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్లమెంట్ సభ్యుడు కానీ వ్యవహారం మరియు బాషా మాత్రం ఆన్ పార్లమెంటరీ అని అలంటి ఎంపీ ఉండటం మన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల దౌర్బాగ్యం అని . జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.

శుక్రవారం జగిత్యాల పర్యటనలో ఎంపీ ధర్మపురి అరవింద్ బి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరవింద్ పై ధ్వజమెత్తారు.


దమ్ముంటే మాతో అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు , కవితక్క హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందని అన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని జగిత్యాల అభివృద్ధిని చూడాలని ఎంపీ అరవింద్ కు ఆమె హితవు పలికారు… మరోసారి బి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై గాని, కవితక్క పై చిల్లర వాక్యాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పసుపు బోర్డు తీసుకొని వస్తా అని రైతులను మోసం చేసిన దొంగ ఎంపీ..మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం బిజెపి లక్ష్యం..
ఏనాడు పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై పోరాటం చేయని దొంగ ఎంపీ అరవింద్. అని ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మూడో స్తానం ఖాయమని, ప్రజలు వారి అబద్దాలను, చెత్త మాటలను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఇంఛార్జి మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు సమిండ్ల వాణి శ్రీనివాస్, బండారి రజనీ నరేందర్, అడువాల జ్యోతి లక్ష్మణ్, మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, బోడ్ల జగదీష్, అల్లే గంగాసాగర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,నాయకులు బాలే శంకర్, దూమల రాజ్ కుమార్, డిష్ జగన్, తొలిప్రేమ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు…