J. SURENDER KUMAR,
ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (జాతర) బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో అధికార యంత్రాంగం తో గురువారం ధర్మపురి లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల మార్చి 3 నుంచి 15 వరకు 12 రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర జరగనున్నది.

పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యస్మిన్ భాషా ఎస్పీ భాస్కర్ మాట్లాడారు.

జాతర లో పాల్గొనే భక్తుల సౌకర్యాలు, ప్రజాప్రతినిధులతో మరియు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారితో సమావేశం లో చర్చించి చేపట్టాల్సిన పనుల గురించి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలోజిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మందమకరం, , ఆర్డిఓ మాధురి, డిఎస్పి ప్రకాష్, ఎమ్మార్వో వెంకటేష్, ఆలయ ఇఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.