ధర్మపురి క్షేత్రంలో శోభాయాత్ర! 
శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా..

J.Surender Kumar,

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా  శివాజీ ఉత్సవ సమితి అధ్వర్యంలో ఆదివారం   ధర్మపురి క్షేత్రంలో ప్రధాన రహదారుల గుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర జరిగింది. 

ఈ శోభాయాత్రలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా ద్విచక్ర వాహన ర్యాలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని  మున్సిపల్ చైర్ పర్సన్  సంగి సత్యమ్మ,  జండా ఊపి  ప్రారంభించారు.


జైన  గ్రామంలో…
ధర్మపురి మండలం జైన గ్రామంలో శివాజీ మహారాజ్  జయంతి సందర్భంగా  బీజేపీ మండల అధ్యక్షులు  సంగెపు గంగారాం , ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్  విగ్రహం  కు పూల మాల వేసి  హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినాన్ని  ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమం లో RSS ధర్మపురి ఖండ సేవా ప్రముఖ్ అల్లే రాజేశం . కట్ట చెంద్ర శేకర్. వేముల భాస్కర్. గాజుల రామదాసు. దుర్గం సుధాకర్. కట్ట లచ్చయ్య, పిట్టల ప్రసాద్,  పిట్టల రాజేందర్.  అక్కినపెల్లి తిరుపతి, రాపెల్లి సుధాకర్. దొంతుల లక్ష్మణ్,. గాండ్ల సాయి. అంకం ప్రసాద్. గడ్డి దుర్గయ్య. కొక్కెరకాని  బాలరాజు. ప్రజలు నాయకులు పాల్గొన్నారు